మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సుర్వే అదృశ్యమయ్యారు. ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా ఇస్లాం నుంచి తిరిగి హిందూ మతంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. పుణేలోని పింప్రి – చించ్వాడ్‌లో సుర్వేతో పాటు ఆమె నలుగురు పిల్లలు కనిపించకుండా పోవడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. తమ కుమార్తెను అత్తింటి వారే కిడ్నాప్ చేశారంటూ సయాలీ సుర్వే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పింప్రి-చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. సయాలీ సుర్వే కొన్నాళ్ల క్రితం తమ కుటుంభం అభిష్టంకు వ్యతిరేకంగా మీరా-భయందర్‌కు చెందిన ముస్లిం వ్యాపారవేత్త ఆతిఫ్ తాసెను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహం కోసం ఆమె ఇస్లాం మతంలోకి కూడా మారింది. తన పేరును అతీజా తాసే అని మార్చుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
ఆమె తన భర్త లౌకికవాది అని నమ్మింది, కానీ ఆ తర్వాత ఆమె వేధింపులకు, హింసకు గురైంది. ఒక రోజు, ఆమె తన కుటుంబానికి ఫోన్ చేసి, అది తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పి, ఈ పరిస్థితి నుండి బయటపడటానికి సహాయం చేయమని వారిని కోరింది. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని బయటపెట్టింది.
కానీ తన పిల్లల కోసమే వాటన్నింటినీ భరించానని తెలిపింది. చివరకు ఆ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నానని సుర్వే తెలిపింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఆమె కుటుంబం వచ్చింది. అప్పుడు, ఆమె చేయాలని నిర్ణయించుకున్న మొదటి పని తన అసలు మతమైన హిందూ మతంలోకి తిరిగి రావడం.తాజాగా పింప్రి-చించ్వాడ్‌లో నిర్వహించిన ఘర్ వాపసీ కార్యక్రమంలో సయాలీ సుర్వే తిరిగి హిందూమతంలోకి మారింది.
తన పేరును ఆద్య సుర్వే మార్చుకుంది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, హిందూ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులను ఎవరూ భరించకూడదని సూచించింది. తాను కూడా చాలాకాలం సహించిన తర్వాతే బయటకు వచ్చేశానని తెలిపింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. వెంటనే ఆమెను కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.

More Stories
సీఈసీపై అభిశంసన నోటీస్ తిరస్కరణ
కాంగ్రెస్ పార్టీకి పాకిస్థాన్‌తో దోస్తీ
హత్య కేసులో మాజీ సీఎం అజిత్ జోగి కొడుకుకు జీవిత ఖైదు