విమాన ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకోవాలి అనుకుంటున్నామని, ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? అనే విషయం తమకు తెలియాలని కోరుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, బ్లాక్‌బాక్స్‌లోని సమాచారం బహిరంగంగా వెల్లడించడం వీలుకాకపోతే, తమకు వ్యక్తిగతంగా అందజేసినా చాలని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు మృతులకు సంబంధించిన కొన్ని సామగ్రి అందించడంలో విమానయాన సంస్థ విఫలమైందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో సంస్థ నుంచి సరైన సహకారం లేదని విమర్శించాయి. ఈ ప్రమాదంపై ఇప్పటికే ఏఏఐబీ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను గత జూలైలో విడుదల చేసింది. పూర్తిస్థాయి నివేదికను వచ్చే జూన్‌లో విడుదల చేయబోతుంది.
గత ఏడాది జూన్ 12న ఈ ఘటన జరిగింది. బోయింగ్ సంస్థకు చెందిన 787-8 విమానాన్ని ఏఐ 171 అనే పేరుతో ఎయిరిండియా నడిపింది. ఈ విమానం జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయల్దేరింది. టేకాఫ్ అయిన, కొన్ని క్షణాలకే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు.

More Stories
ఒక్కరోజే యూఏఈ నుంచి భారత్‌కు 90 ప్రత్యేక విమానాలు
హిమాచల్ ప్రవేశ పన్నుపై పంజాబ్ టాక్సీ, ట్రక్ డ్రైవర్లు నిరసన
ఎన్‌సిఇఆర్‌టికి `డీమ్డ్ టు బి యూనివర్శిటీ’ హోదా