పశ్చిమాసియా సంక్షోభం కారణంగా భారత్ చమురు కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కు మరింత చమురు సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది. ఆయిల్, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) సరఫరాను కూడా పెంచబోతున్నట్లు రష్యా శుక్రవారం ప్రకటించింది. రష్యా మొదటి డిప్యూటీ ఛైర్మన్ డెనిస్ మాంటురోవ్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం భేటీ జరిపిన సందర్భంగా చమురు సరఫరాపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత అవసరాలకు సరిపడా చమురును అందించే సత్తా రష్యన్ కంపెనీలకు ఉందని, చమురు ఉత్పత్తి పెంచుతామని డెనిస్ పేర్కొన్నారు. ఈ అంశంపై భారత్ లోని రష్యన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం రష్యా గత ఏడాది చివరినాటికి మినరల్ ఫెర్టిలైజర్స్ సరఫరాను 40 శాతం పెంచింది. భవిష్యత్తులో భారత అవసరాలకు అనుగుణంగా మరింత పెంచేందుకు సిద్ధంగా ఉంది.
అణుశక్తి అంశంలో రష్యా, భారత్ తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీనిలో భాగంగానే కుడంకులామ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం పవర్ యూనిట్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా యూరియా ఉత్పత్తి ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాయి. అణు సహకారంలో కూడా ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి.
పరిశ్రమలు, అంతరిక్షం, విద్య, ఇన్నోవేషన్, వాణిజ్యం, టెక్నాలజీ, ఖనిజాలు వంటి అంశాల్లో కూడా రెండు దేశాలు మరింతగా కలిసి పని చేయాలని నిర్ణయించాయి. డెనిస్ మంతురోవ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో కూడా సమావేశమయ్యారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విశ్లేషణ ప్రకారం, భారతదేశం, అమెరికా తమ ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయడానికి ఒక నెల ముందు, జనవరి 2026లో, భారతదేశం రష్యా నుండి 1.98 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురును దిగుమతి చేసుకుంది.

More Stories
విమాన ఇంధన ధరల స్థిరత్వానికి రూ.10 వేల కోట్ల ఇంధన నిధి
భారత్ సహా 54 దేశాలపై అమెరికా 12.5శాతం అదనపు సుంకం
హర్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా ఒమాన్ తీరం నుండి చమురు రవాణా