హర్యానా మాజీ సీఎం, ఎజెఎల్‌ లపై ఈడీ కేసు కొట్టివేత

హర్యానా మాజీ  సీఎం,  ఎజెఎల్‌ లపై ఈడీ కేసు కొట్టివేత

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా, ఎం/ఎస్‌ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఎజెఎల్‌)లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాఖలు చేసిన ఫిర్యాదును పంచకుల కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పిఎంఎల్‌ఎ చట్టం కింద హర్యానా ప్రత్యేక జడ్జి రాజీవ్‌ గోయల్‌, ఈడి ఫిర్యాదును కొట్టివేశారు.  సిబిఐ దర్యాప్తు చేసిన ప్రధాన కేసులోనూ మాజీ సిఎం, ఎజెఎల్‌ను మార్చి 25న పంజాబ్‌, హర్యానా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చినందున,  పంచకులలోని పిఎంఎల్‌ఎ కోర్టు ఈడి కేసును కొట్టివేసిందని హుడా తరపున న్యాయవాది తెలిపారు.  విజయ్ మదన్‌లాల్‌ చౌదరి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిందితులు ప్రధాన కేసులో (ఆధార నేరం) నిర్దోషులుగా విడుదలైనందున ఈడి ఫిర్యాదు నిలవదని పేర్కొన్నారు. విజరుమదన్‌లాల్‌ చౌదరి కేసులో సుప్రీంకోర్టు ఈవిధంగా తీర్పునిచ్చింది.

 ”ఒక వ్యక్తి నిర్దేశిత నేరం నుండి తుదిగా విడుదలైనా, నిర్దోషిగా విడుదలైనా లేదా అతనిపై ఉన్న నేర విచారణను తగిన అధికార పరిధి కలిగిన కోర్టు రద్దు చేసినా , ఆ వ్యక్తిపై మనీలాండరింగ్‌ నేరం నిలవదు” అని పేర్కొంది. పంచకుల, సెక్టార్‌ 6లోని ప్లాట్‌ నెంబర్‌ సి-17ను,. లాభాపేక్ష లేని ప్రాతిపదికన ఒక వార్తాపత్రికను ప్రారంభించే నిమితం, చదరపు మీటరు రూ.91 రాయితీ ధరతో ఎజెఎల్‌కు కేటాయించడంపై మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడి కేసు నమోదు చేసింది.