వచ్చే రానున్న రోజుల్లో ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వచ్చే 3 ఏళ్లలో బెంగళూరులో ఏకంగా 80 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని ఓ టెక్కీ సోషల్ మీడియా వేదికగా చేసిన హెచ్చరిక ఆందోళన కలిగిస్తున్నది. ఓ పెద్ద టెక్ కంపెనీలో నేరుగా ఏఐ మైగ్రేషన్ ప్రాజెక్టులోనే పనిచేసిన బెంగళూరుకు చెందిన టెక్కీ ఇటీవలే ఉద్యోగం కోల్పోయారు. కానీ, తాను ఎలాంటి ఆందోళన చెందడం లేదని పేర్కొంటూ లేఆఫ్స్ ప్రక్రియపై రెడ్డిట్ పోస్టులో పలు అంశాలను రాసుకొచ్చారు.
బెంగళూరులో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు నగరంలో ఇల్లు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇల్లు కొనడానికి బదులుగా అద్దె ఇంట్లోనే ఉన్న తన నిర్ణయం సరైనదేనని సమర్థించుకున్నారు. అతను చేసినట్లు తెలిపారు. గత ఏడాదిలోనే ఇల్లు కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.2 కోట్లు తన వద్ద ఉన్నాయని, కానీ ఇల్లు కొనుగోలు చేయాలేదని రాసుకొచ్చారు. తన ఆఫీసుకు సమీపంలోనే అద్దెకు ఉన్నట్లు తెలిపారు.
నేరుగా ఏఐపై పని చేయడం ద్వారా రానున్న కొద్ది సంవత్సరాల్లో ఐటీ ఉద్యోగుల పరిస్థితులు ఎలా ఉండనున్నాయో అర్థమైందంటూ చెప్పుకొచ్చారు. “ఐటీ రంగంలోని ఉద్యోగులలో సుమారుగా 70 శాతం నుంచి 80 శాతం మంది సేవా ఆధారిత కంపెనీలలో పనిచేస్తున్నారు. క్లయింట్లు కోరుకుంటే వారిలో చాలా మంది చేసే పనిని రాబోయే పూర్తి చేస్తుంది. దీంతో రానున్న 1 నుంచి 3 సంవత్సరాలలో ఏఐ సాధనాలతో వారిని నేరుగా భర్తీ చేయవచ్చు” అని తెలిపారు.
“అయితే, అంతర్గత సమాచారం, ఉన్నతాధికారుల వంటి వారి ప్రకారం 70 శాతం మంది ఉద్యోగం కోల్పోయేందుకు 3-5 ఏళ్ల పట్టవచ్చని అర్థమవుతోంది. మిగిలిన 30 శాతం మంది ఉద్యోగాలు సురక్షితమే. ఏఐ ఏజెంట్ల నిర్వహణ కోసం 30 శాతం మానవ శక్తి అవసరం” అంటూ రాసుకొచ్చారు. ఏఐ పేరుతో కంపెనీలు ఎందుకు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయో అంశంపై పలు అంశాలను పంచుకున్నారు.
“ఉద్యోగుల తొలగింపుల ద్వారా రెండు ప్రయోజనాలు పొందుతున్నారు. తాము ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామన్న ప్రచారం జరుగుతుదని, అలాగే తక్కువ మందితోనే పనిని పూర్తి చేయవచ్చని నిరూపిస్తున్నట్లు అవుతుంది”. ఇక రెండోది జీతభత్యాలను తగ్గించడం ద్వారా బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకోవచ్చని భావిస్తున్నాయని రాసుకొచ్చారు. తాను గతంలో నేరుగా చేసిన పనిని ఆటోమేట్ చేసే ఏఐ ప్రాజెక్టులోనే పని చేసినట్లు టెక్కీ తెలిపారు. భవిష్యత్తులో సేవా-ఆధారిత ఐటీ ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగు కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

More Stories
దేశంలో ఇంధన కొరత లేదు
ఏప్రిల్‌లో చమురు సరఫరాలో అంతరాయం రెట్టింపు
ఐప్యాక్ కార్యాలయాలలో ఈడీ సోదాలు