దేశీయంగా స్థిరమైన ఆదాయంతోపాటు దిగుమతులపై పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దిగుమతులపై పన్నుల రాబడి ఏకంగా 17.8 శాతం పెరగగా, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 5.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు మార్చిలో రూ.1,77,990 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే ఇది 8.2 శాతం ఎక్కువ.
మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్టీ వసూళ్లు సానుకూల వృద్ధిని కనబరిచాయి. ఈ ఏడాది స్థూల వసూళ్లు 8.3 శాతం వృద్ధితో రూ.22.27 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఇవి రూ.20.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 7 శాతం జీడీపీ వృద్ధితో ముందుకు సాగుతున్న తరుణంలో జీఎస్టీ వసూళ్లు కూడా అదే స్థాయిలో పెరగడం శుభపరిణామమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం మార్చి నెలలోనే కాకుండా, మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో మొత్తం వసూళ్లు 8.3 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రూ. 22.27 లక్షల కోట్లకు చేరాయి. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి మరియు పన్ను వసూళ్ల వ్యవస్థలో వచ్చిన పారదర్శకతకు నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంటోంది.

More Stories
భారత్ కు ఇజ్రాయెల్ లైట్ మెషిన్ గన్స్.. సాంకేతిక బదిలీ
ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ముడి చమురు
చైనా సీసీటీవీ కెమెరాలపై భారత్ లో నిషేధం!