ఇంతకు ముందు హర్మూజ్ జలసంధిని ఇరాన్ నుంచి విడిపించేందుకు మిత్రదేశాలు కలిసి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. కానీ ఆయనకు మిత్ర దేశాల నుంచి ఏ మాత్రం సహకారం అందలేదు. ఇరాన్తో యుద్ధం చేయడానికి యూఎస్ మిత్రదేశాలు ఏవీ ముందుకు రాలేదు. దీనితో ట్రంప్ బ్రిటన్, ఫ్రాన్స్లపై మండిపడ్డారు. వారు పిరికిపందలని విమర్శించారు.
వారి అవసరం అమెరికాకు లేదని, తమకు సాయం చేయని నాటో దేశాలను తప్పక గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. తామే ఒంటరిగా ఇరాన్ ఆటకట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇరాన్‌తో యుద్ధం రెండు లేదా మూడు వారాల్లో ముగియవచ్చని, కీలకమైనహార్మూజ్ జలసంధి చమురు రవాణా మార్గాన్ని తెరవడంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ తెలిపారు.
అమెరికా.. ఇరాన్‌ను ‘త్వరలో, బహుశా రెండు, మూడు వారాల్లో’ విడిచిపెడుతుందని పేర్కొన్నారు. ‘కానీ మేము పనిని పూర్తి చేస్తున్నాము’ అని ఆయన నొక్కి చెప్పారు. ‘వారు కలిగి ఉన్న ప్రతి ఒక్కదాన్ని మేము నాశనం చేయాలనుకుంటున్నాము’ అని ట్రంప్ అన్నారు. ‘అంతకుముందు మేము ఒక ఒప్పందం చేసుకోవచ్చు’ అని కూడా జోడించారు.

More Stories
పూర్తి ఆరోగ్యంగా మొజ్తాబా ఖమేనీ
ఇరాన్ రవాణాకు పాక్ ద్వారా ఆరు ప్రత్యేక భూమార్గాలు!
అమెరికా యుద్ధ నౌకల లక్ష్యంగా ఇరాన్ హూట్ సూపర్ టార్పిడో!