నందిని సిధారెడ్డి తెలంగాణలో 1955 జూన్ 12న జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ యోధుడు. తల్లి రత్నమాల. భార్య మల్లీశ్వరి. సిద్ధిపేటలో పాఠశాల విద్యను పూర్తి చేసి, హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. తరువాత మెదక్, సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. 2012లో పదవీ విరమణ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో ప్రభుత్వం ఆయనను తెలంగాణ సాహిత్య అకాడమీకి మొదటి ఛైర్మన్ గా నియమించింది. 1997లో ‘నాగేటి చాల్లల్ల’ అనే కవిత తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచింది. ఆయన భూమిస్వప్నం, ఇగురం, ఆవర్థనం, కుల వృత్తులు, ప్రాణహిత వంటి అనేక రచనలు చేశారు. తాజాగా ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 వరించింది.
అంతకు ముందు నాగేటి చాల్లల్ల అనే పాటకు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు (2010) వచ్చింది. 2001లో ప్రాణహిత కవితా సంకలనానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు పురస్కారం అందించారు. 1988లో దాశరథి పురస్కారం లభించింది. “ప్రపంచ దుఃఖాన్ని నా కష్టంగా భావించాను. అందుకే అనిమేష రాశాను. నా సాహిత్య ప్రయాణమే ప్రపంచంలోని దుఃఖాలను తొలగించి ఉన్నత సమాజంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభించాను” అవార్డు గురించి ప్రస్తావిస్తూ చెప్పుకొచ్చారు.

More Stories
వందేమాతరం గీతం సమయంలో అసెంబ్లీ నుండి ఎంఐఎం వాకౌట్
బడ్జెట్ లో విద్యకు 15% నిధులు కేటాయించాలి
రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో కాల్పుల కలకలం