“సిలిండర్ల బ్లాక్‌మార్కెట్ అరికట్టాలని రాష్ట్రాలను కోరాం. వాణిజ్య సిలిండర్ల విషయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఏపీ, బిహార్, కర్ణాటక, ఒడిశాలో వాణిజ్య సిలిండర్లు నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకున్నాం. ఎల్పీజీ సరఫరాలో గృహాలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నాం” అని ఆమె తెలిపారు.
“పశ్చిమ గల్ఫ్‌లోని హర్మూజ్ వద్ద 24 నౌకలు ఉన్నాయి. ఎల్పీజీ సరఫరా చేసే 2 నౌకలు హర్మూజ్ నుంచి బయలుదేరాయి. శివాలిక్, నందాదేవి నౌకల్లో ఎల్పీజీ తరలింపు జరుగుతోంది. రెండు నౌకలు ఈనెల 16, 17 తేదీల్లో ముంద్రా, కాండ్లా పోర్టులకు వస్తున్నాయి” అని ఆమె వెల్లడించారు. ఆ తర్వాత శివాలిక్, నందాదేవి నౌకలు సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో దేశానికి వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు. మార్చి 16, 17 తేదీల్లో రావొచ్చని తెలిపారు.
“పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో వారికి సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. హార్మూజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్‌లో 24 భారతీయ జెండాతో కూడిన నౌకలు ఉన్నాయి. మొత్తం 611 మంది నావికులు ఉన్నారు” అని ఆయన చెప్పారు.

More Stories
అమెరికాతో వాణిజ్య ఒప్పందం రద్దు ప్రచారంలో నిజం లేదు
ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు.. భయంతో ఎవరూ బుక్ చేయొద్దు
ప్రజలపై ద్రవ్యోల్బణం మరోసారి పంజా