కావూరు సాంబశివరావు కన్నుమూశారని తెలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఐదుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా వారు ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని ఆయన సేవలను కొనియాడారు. వారికి ఉన్న సుదీర్ఘ అనుభవంతో ప్రజాసమస్యలపై పార్లమెంటులో తన గళాన్ని వినిపించారన్నారు. కావూరి సాంబశివరావు మరణం పట్ల కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి కావూరి అని కొనియాడారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై నిరంతరం గళం వినిపించిన గొప్ప నాయకుడు కావూరి అని ప్రశంసించారు.
కావూరు సాంబశివరావు మృతిపట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంతాపం తెలిపారు. 2013లో ఆయనను సిరిసిల్లకు ఆహ్వానించానని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. కావూరు సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు మద్ధతుగా నిలిచారని కేటీఆర్ కొనియాడారు.

More Stories
ఎపి హైకోర్టు తొలి మహిళా సిజెగా జస్టిస్ లీసా గిల్
లిక్కర్ స్కామ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్