పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాంపల్లి స్టేషన్‌ను సమగ్రంగా అప్‌గ్రేడ్ చేస్తూ ఆధునీకరించేందుకు రూ 350 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ అధికారులతో కలిసి నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రైల్వే శాఖ వరుస కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి స్టేషన్‌కు రోజుకు సుమారు 60 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, దాదాపు 20 వేల మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు.
భవిష్యత్తులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొంటూ టెండర్ ప్రక్రియలో రూ.327 కోట్లు ఖరారయ్యాయని, అవసరమైతే రెండో దశలో మరిన్ని నిధులు సమకూర్చి, అత్యాధునిక ప్రమాణాలతో నిర్మాణాన్ని 2027 చివరికి పూర్తి చేస్తామ్మని హామీ ఇచ్చారు.
పైభాగంలో సుమారు 6,500 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో సెంట్రల్ హాల్ నిర్మిస్తున్నామని, అందులో రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, ఇతర స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ప్లాట్‌ఫారమ్‌లపై కూర్చోవడం, నిద్రపోవడం వంటి పరిస్థితులు తగ్గి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తామని వివరించారు.
మొత్తం 16 లిఫ్ట్‌లు, 8 ఎస్కలేటర్లు, ఫుట్‌పాత్‌లపై సులభంగా నడిచే విధంగా అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని చెప్పారు.
బేస్మెంట్-1, బేస్మెంట్-2 లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాంమని, దాదాపు 150 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఆధునిక రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీస్ ఏర్పాటు చేస్తున్నామని, వైఫై, సీసీటీవీ సహా అన్ని ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి 2014 వరకు రూ.258 కోట్లు మాత్రమే కేటాయించేవారని, ప్రస్తుతం రూ.5,454 కోట్లు కేటాయిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో మొత్తం రూ.47,984 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 346 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు పూర్తి చేశామని, 513 కిలోమీటర్ల లైన్లను డబ్లింగ్/ట్రిప్లింగ్/అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. తెలంగాణలో 1,979 కిలోమీటర్ల రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశామని, ఒక్క కొత్త లైన్ మినహా 100% ఎలక్ట్రిఫికేషన్ సాధించామని స్పష్టం చేశారు.
More Stories
రాజ్యసభకు అభిషేక్ మనుసింఘ్వీ, నరేందర్‌రెడ్డి నామినేషన్
నకిలీ డెత్ సర్టిఫికెట్లుతో ఎల్ఐసిలో రూ.1.52 కోట్లు స్వాహా
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి