పాకిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై తమ వైమానిక దళం దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైంది. దీనిని పాకిస్థాన్ రిపేర్ చేసుకుంటోంది. ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ ఆ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ కీలక సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ వెల్లడించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలకమైన పాక్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.
“ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడుల ఫలితంగా పేర్కొన్న లక్ష్యాలకు గణనీయమైన నష్టం వాటిల్లింది. కాబూల్, బాగ్రామ్, కొన్ని ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం నిన్న రాత్రి, ఈరోజు ప్రారంభించిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ జరిగింది” అని ఆఫ్ఘానిస్తాన్ ప్రకటించింది. ఆఫ్ఘన్ గగనతలంలో ఏదైనా ఉల్లంఘన లేదా ‘పాకిస్తాన్‌లోని దుష్ట పక్షాల గౌరవం లేకపోవడం’కు బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
సరిహద్దు దాడులకు సంబంధించిన ఇటీవలి నివేదికలు రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలలో తీవ్ర పెరుగుదలను సూచిస్తున్నాయి. తమ దేశంలోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించిందని ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ సైనిక చొరబాట్లకు ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. తాము చేసిన దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పలు సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని తెలిపింది. మరోవైపు ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్‌లు తెలిపారు.

More Stories
ఇరాన్ సుసంపన్నం యురేనియం పరిష్కారంకు రష్యా సిద్ధం
అమెరికా- ఇరాన్ యుద్ధానికి త్వరలోనే ముగింపు
ఇజ్రాయెల్‌తో ఇటలీ రక్షణ ఒప్పందం నిలిపివేత