స్వదేశీ వస్తువుల వినియోగం గురించి, 2036 ఒలింపిక్స్ లో భారత్ ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధించాలని కోరుతూ `రన్ ఫర్ స్వదేశీ’ కార్యక్రమాన్ని క్రీడాభారతి, స్వదేశీ జాగరణ మంచ్, జై భారత్ లెజెండ్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. సరూర్ నగర్ స్టేడియం నుండి చైతన్యపురి వరకు జరిగిన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి ప్రసంగిస్తూ విద్యార్థులకు భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్లు ప్రస్తుతం అమెరికా, చైనా, టర్కీ వంటి దేశాలు ఏ విధంగా దోచుకుంటున్నాయో వివరించారు.
మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా వస్తువులను కొనుగోలు చేయాలని, స్థానిక వ్యాపారుల వద్ద తమ నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఉపాధి దొరుకుతుందని సూచించారు. భారతదేశ సంస్కృతిని కాపాడాలని పేర్కొంటూ స్వదేశీ మన జీవన విధానం కావాలని తెలిపారు. అలాగే యువత ఆటల ద్వారా శారీరక ధారుడ్యం పెంపొందించుకోవాలని, ఆటల ద్వారా మన దేశ ఖ్యాతిని పెంపొందించాలని చెప్పారు. ఫోన్లలో ఆటలు తగ్గించి మైదానంలో దిగాలని యువతకు పిలుపునిచ్చారు.
ఒలింపిక్ అసోసియేషన్ పూర్వ కోశాధికారి డా. సోమేశ్వర్ రావు మాట్లాడుతూ అన్ని సమస్యలకు పరిష్కారం స్వదేశీ వస్తువుల వాడడమే అని స్పష్టం చేశారు. ప్రతి ఇంటి మహిళ ఇంటిని స్వదేశీగా తయారు చేయాలని సూచించారు. యువత క్రీడల ద్వారా మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన చెప్పారు.
స్వదేశీ జాగరణ మంచ్ విభాగ్ కన్వీనర్ వివేకానంద మాట్లా డుతూ “రన్ ఫర్ స్వదేశీ- రన్ ఫర్ ఇండియా” నినాదంతో , స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ద్వారా దేశ ఆర్థిక భద్రత, స్వావ లంబన సాధ్యమవుతుందని తెలిపారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడ టాన్ని తగ్గించి, దేశీయపరిశ్రమలు, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహిం చాలనే సంకల్పాన్ని ఈ రన్ ద్వారా ప్రజల్లో నాటాలనే లక్ష్యం అని చెప్పారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన క్రీడాభారతి రాష్ట్ర కార్యదర్శి డా. బాబులాల్ మాట్లాడుతూ క్రీడలే మనిషికి మానసిక వికాసానికి తోడ్పడుతాయని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడలవైపు మల్లే విధంగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. యువతను ప్రోత్సహించడం ద్వారా 2036లో జరిగే ఒలింపిక్స్ లో భారత్ అత్యధికంగా మెడల్స్ సాధిస్తామని తెలిపారు.
అలాగే స్వదేశీ సంకల్పంలో భాగంగా, ప్రతి ఇంటిలో స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, స్థానిక భాషలు, సాంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణ, యువతలో ఔత్సాహికతను పెంపొందించడం వంటి అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. “హర్ ఘర్ స్వదేశీ – హర్ యువ స్వదేశీ” అనే భావనను ప్రతి పౌరునికి చేరవేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ కేశవ్ సోనీ, ప్రాంత సంఘటనా మంత్రి రచ్చ శ్రీనివాస్, కార్యకర్తలు దృహన్, వినయ్, మనీష్, సాహిత్, హరీష్, అభిలాశ్, రాఘవేంద్ర, ప్రదీప్, పండరిలతో పాటు వివిధ కళాశాలల ఉపాధ్యాయులు, 1856 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి రన్ అనంతరం సర్టిఫికెట్స్ అందజేశారు.

More Stories
కుటుంబ సభ్యులతో సహా ఖమేనీ మృతి
ఆఫ్ఘన్ లో భార్యను కొట్టడంకన్నా జంతువులకు హాని కలిగిస్తే ప్రమాదం
బాణసంచా తయారీలో భారీ విస్ఫోటం.. 21 మంది మృతి