ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం పది రాష్ట్రాల్లో సుమారు 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నది. తెలంగాణ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఆ ఇద్దరి పదవీకాలం ముగియనున్నది.
ఇక మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఏడు మంది రాజ్యసభ ఎంపీలు తమ పదవీకాలాన్నిఏప్రిల్ 2వ తేదీన పూర్తి చేసుకోనున్నారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఆ ఏడు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒడిశాలో నలుగురు , తమిళనాడులో ఆరుగురు, బెంగాల్‌లో అయిదుగురు, అస్సాంలో ముగ్గురు , బీహార్‌లో అయిదుగురు, చత్తీస్‌ఘడ్, హర్యానాలలో ఇద్దరేసి, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరి సీటు కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.
37 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారని, వారి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇవాళ తన మీడియా ప్రకటనలో పేర్కొన్నది. ఎన్నికల షెడ్యూల్‌కు చెందిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 26వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 9వ వరకు దరఖాస్తులను ఉపసంహరించుకోవచ్చు. 16వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

More Stories
ఏప్రిల్‌లో బెంగాల్, తమిళనాడు ఎన్నికలు
పాక్ కు రావి నది నుంచి నీళ్లు బంద్
జీలం నదిపై దశాబ్దాలుగా నిలిచిపోయిన వులార్ బ్యారేజీ నిర్మాణం