వచ్చే ఏప్రిల్‌లో బెంగాల్, తమిళనాడు శాసనసభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.
ఇక, ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇప్పటికే ఈసీ అధికారులు పర్యటనలు ప్రారంభించారు.
ప్రస్తుతం ఈసీ బృందం అసోంలో పర్యటిస్తుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లయీలకు మే నెలలోను, పుదుచ్చేరి శాసనసభకు జూన్ 15తో గడువు ముగియనుంది. ఇక, ఎన్నికల జరగనున్న రాష్ట్రాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివర దశకు చేరుకుంది. ఫిబ్రవరి 10 అసోం, ఫిబ్రవరి 14న పుదుచ్చేరిలో ఓటర్ల జాబితా ప్రచురించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో మంగళవారం తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 21న కేరళ, 28న పశ్చిమ బెంగాల్లో తుది జాబితాలు విడుదలవుతాయి. కానీ, ఎస్ఐఆర్‌పై తమిళనాడు, బెంగాల్‌లో రగడ కొనసాగుతోంది. తమిళనాడులో డిసెంబరు 19న విడుదల చేసిన ముసాయిదాలో 97 లక్షల మంది పేర్లను తొలగించారు. బెంగాల్‌లోనూ 58 లక్షల మంది పేర్లు డిలీట్ చేశారు.
ఇప్పటికే దీనిపై తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దీదీ యుద్ధం ప్రకటించారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసి, స్వయంగా మమతా బెనర్జీ వాదనలు వినిపించడం గమనార్హం. బెంగాల్‌లో వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన మమతా బెనర్జీ నాలుగోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అటు, బీజేపీ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది.
గత ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని భారీ అంచనాలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఆ పార్టీకే అనుకూలమని వచ్చినా ఫలితాలు మాత్రం కమలానికి షాకిచ్చాయి. 2011, 2016కు మించి భారీ మెజార్టీతో మమతా బెనర్జీ గెలిచారు. ఈసారి ఏ అవకాశం వదులుకోరాదని కమలనాథులు గట్టిగానే కృష్టిచేస్తున్నారు.

More Stories
పాక్ కు రావి నది నుంచి నీళ్లు బంద్
జీలం నదిపై దశాబ్దాలుగా నిలిచిపోయిన వులార్ బ్యారేజీ నిర్మాణం
మణిపూర్‌లో వివిధ నేరాల విచారణపై సిబిఐని ప్రశ్నించిన సుప్రీం