“రాహుల్ గాంధీ మాటలకు, చేతలకు సంబంధం లేదు. రాహుల్ చెప్పే మాటలు బాగుంటాయి. కానీ, చేసేవి మాత్రం భిన్నం. పంజాబ్‌లో ఆయన నియమించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకున్నవారు అవినీతికి పాల్పడుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ విషయం ఆయనతో చెప్పడానికి ప్రయత్నిస్తూ సమయం అడిగా. కానీ, ఇవ్వలేదు” అంటూ ఆమె ధ్వజమెత్తారు.
“ఇప్పటికే పంజాబ్‌లో టిక్కెట్లు అమ్ముకున్నారు. రాహుల్ గాంధీకి వాస్తవ పరిస్థితులు తెలియవు. కిందిస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు. రాహుల్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనకు అసలు విషయం తెలియనీయరు. పార్టీలో ఏం జరుగుతుందో నాయకత్వం గుర్తించకపోతే దాని పరిణామాల్ని అనుభవించకతప్పదు’’ అని నవజోత్ కౌర్ హెచ్చరించారు. ఇక.. ఇటీవల రాహుల్ గాంధీని నవజోత్ కౌర్ `పప్పు’ అని కూడా విమర్శించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను మరింత దూరం పెట్టింది.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ, ఆయనపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేవని, ఆయన ఆధ్యాత్మిక వ్యక్తి అని ఆమె కొనియాడా. “మేము మా జీవితాంతం నిజాయితీగా ఉన్నాము. నిజాయితీగా ఉండటం ద్వారా, ఆర్థికంగా ఇబ్బందులు పడటం ద్వారా పంజాబ్ ప్రజల, భారత ప్రజల విశ్వాసాన్ని మేము ఇప్పుడే పొందాము. మీరు ప్రధాని మోదీ వైపు వేలు చూపలేరు. ఆయనను తాకడానికి ప్రయత్నించండి. ఆయన దగ్గర ఒక్క పైసా ఉందా? ఆయనపై ఏదైనా ఫైల్ ఉందా? ఆయనను వ్యక్తిగతంగా తాకడానికి ప్రయత్నించండి. ఆయనకు వ్యతిరేకంగా ఏమీ లేదు” అని సిద్ధూ స్పష్టం చేశారు.

More Stories
హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లలకు జన్మ ఇవ్వాలి
‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’గా స్మృతి మంధాన
అజిత్ పవర్ మృతిపై సీబీఐ దర్యాప్తు కోరిన భార్య సునేత్ర