చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా చైనా సరిహద్దులో దిబ్రూగఢ్ – మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన తొలి అత్యవసర ల్యాండింగ్ సదుపాయంపై రోడ్డుపై తాను ప్రయాణించిన ప్రత్యేక విమానంలో దిగారు. ఈ సదుపాయం ప్రారంభించడం ద్వారా అస్సాంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైనట్టయింది.
దిబ్రూగడ్‌లోని మొరాన్ బైపాస్ వద్ద తీర్చిదిద్దిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై సీ130జే విమానంలో మోదీ దిగారు. 
తొలుత చబువా ఎయిర్‌ఫీల్డ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ సీ 130 జే విమానం ఎక్కి మొరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిలో దిగారు. అదే ఈఎల్​ఎఫ్​పై ఆధునిక యుద్ధ విమానాలైన రఫేల్, సుఖోయ్-30, హెలికాఫ్టర్ల విన్యాసాలను ఆయన తిలకించారు.  దాదాపు 40 నిమిషాలు పాటు ఈ విన్యాసాలు జరిగాయి. అంతుకుముందే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ గురించి ప్రధాని మోదీ తన ఎక్స్​ ఖాతాలో పోస్ట్ చేశారు. 
క్లిష్ట సమయంలో సహాయ కార్యకలాపాలకు, అత్యవసర ప్రతిస్పందనకు ఈ ఈఎల్‌ఎఫ్ కీలకమని పేర్కొన్నారు.  చైనా సరిహద్దులకు సమీపంలో దేశ రక్షణకు ఈ ఈఎల్​ఎఫ్ కీలకం కానుంది. 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే కోసం దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర సమయాల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సమన్వయంతో ఈ ఈఎల్​ఎఫ్​ను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. 
 
దీని వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు జరిగినప్పుడు భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు అవకాశం ఉంటుంది. 40 టన్నుల వరకు యుద్ధ విమానాలను, 74 టన్నుల గరిష్ఠ టేకాఫ్​ బరులవు గల రవాణా విమానాలను నిర్వహించగలదు. టేకాఫ్, ల్యాండింగ్​కు అనుకూలంగా దీనిని రూపొందించారు. ఇప్పటికే పశ్చిమ, ఉత్తర, మధ్య భారత్​లో ఈ ఈఎల్​ఎఫ్​లు ఉన్నాయి.

రూ. 5,450 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవి ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉన్న విద్య వంటి అంశాలను బలోపేతం చేసే లక్ష్యంగా ఉన్నాయి. బ్రహ్మపుత్రపై దాదాపు రూ.3,030 కోట్ల వ్యవయంతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ప్రారంభిస్తారు. 2019 ఫిబ్రవరి 9న ఈ వంతెనకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే పీఎం-ఈబస్సు సేవా కింద 225 ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించారు.