టాలీవుడ్ లో ప్రముఖ నటుడు రణ్ వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. రణ్ వీర్ ను, అతడి వద్ద పనిచేస్తున్న వారిని చంపేస్తానని దుండగుడు హెచ్చరించాడు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇదే తరహా బెదిరింపులు చేశాడు. ఈ మేరకు వాట్సాప్ లో ఓ ఆడియో సందేశం పంపించినట్లు సమాచారం. ఈ మెసేజ్ తో బాలీవుడ్ లో కలకలం రేగుతోంది. తనను తాను బిష్ణోయ్ అనుచరుడిగా పేర్కొంటూ హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.
తన డిమాండ్లను అంగీకరించకపోతే వారితో పాటు వారి సిబ్బందినీ హత్య చేస్తామని హెచ్చరించాడు. ‘‘రణ్ వీర్ సింగ్.. నీ భవిష్యత్తులో ఏడు తరాలు గుర్తుండిపోయేలా నిన్ను హత్య చేస్తాం. నువ్వు మా బెదిరింపులను లెక్క చేయకపోగా మిగతా వారికీ ఉచిత సలహాలు ఇస్తున్నావు. పోలీసులకు ఫిర్యాదు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నావు. నువ్వు కూడా ఓ ఫిర్యాదు చేసినట్టున్నావు.. పర్వాలేదు” అంటూ హెచ్చరించారు.
“ఇక నీకు మామూలుగా చెప్పం. నీ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారు. వారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళతారు.. వారి కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయనే వివరాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. వారితో మొదలు పెడతాం. ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి చంపేస్తుంటే అప్పుడు నీకు తెలిసివస్తుంది. నీకు ఇంకా టైముంది. హత్యలు మొదలయ్యే లోపే మేలుకో” అంటూ దుండగుడు బెదిరించాడు. దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇది వర్తిస్తుందని హెచ్చరించాడు.

More Stories
పిఎంఓ నూతన కార్యాలయం సేవా తీర్థ్ ప్రారంభం
రాహుల్ సభ్యత్వం రద్దు చేయాలని బిజెపి ఎంపీ తీర్మానం
114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం