ఫిబ్రవరి 5న సాయంత్రం పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే అదే రోజు ఉదయం స్పీకర్ ఓంబిర్లా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించేందుకు పార్లమెంటుకు రావొద్దని తాను ప్రధాని మోదీని కోరాననిసభలో చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ సీటు వద్దకు వెళ్లి, ఆయనతో అమర్యాదగా ప్రవర్తించాలని అనుకున్నారనే సమాచారం తనకు అందిందని ఆరోజున స్పీకర్ తెలిపారు.
ఈ రెండు అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్న విపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు సోమవారం రోజు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు అధికార పార్టీ బీజేపీ ఒత్తిడి వల్ల తమపై ఆయన నిరాధారణ, తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ఓ లేఖను వ్రాసారు. స్పీకర్ చేసిన ఆరోపణలు విపక్ష మహిళా ఎంపీల పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని తెలిపారు.
విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాసేలా స్పీకర్ ఓంబిర్లా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో ఎంపీలు ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ఎంపీలే లోక్‌సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు.
కొందరు కాంగ్రెస్ ఎంపీలు నేరుగా స్పీకర్ ఓంబిర్లా ఛాంబర్‌లోకి దూసుకెళ్లారని, వాళ్లంతా ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీల వ్యవహార శైలిని ఖండించడానికి కొన్ని పదాలు సరిపోవవని తెలిపారు. స్వయంగా కాంగ్రెస్ అగ్రనేతే స్వీయ నియంత్రణలో లేనప్పుడు, లోక్‌సభ స్పీకర్ ఏది చేస్తే అదే కరెక్టు అవుతుందని రిజిజు తేల్చి చెప్పారు.

More Stories
శరద్‌పవార్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఏఐ, మొబైల్ ఫోన్లకు బానిస కాకూడదు
జె ఎన్ యు విద్యార్థి సంఘం నేతల బహిష్కరణ