ఎప్‌స్టీన్‌ను దలైలామా ఎప్పుడూ కలవలేదని, ఆయన తరఫున మరెవరూ కూడా ఎప్‌స్టీన్‌తో సమావేశమయ్యేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపింది. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో జెఫ్రీ ఎఫ్ స్టీన్ తో దలైలామా సమావేశమైనట్లు చూపించడంపై దలైలామా ఆఫీసు అభ్యంతరం వ్యక్తం చేసింది. దలైలామాపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించింది.
‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లోని వివరాలు బహిర్గతం కావడం అమెరికాలో సంచలనమవుతోంది. పిల్లల లైంగిక వేధింపుల నిందితుడు, సీరియల్ రేపిస్ట్ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయంటూ వివిధ దేశాల్లోని పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి వ్యక్తుల పేర్లు బహిర్గతమవుతున్నాయి. ఈ క్రమంలో దలైలామా పేరూ ప్రస్తావనకు రావడంతో ఆయన కార్యాలయం వెంటనే ఖండించింది.
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు చెందిన 30 లక్షలకు పైగా ఫైళ్లు విడుదల చేసింది. అందులో 2,000కు పైగా వీడియోలు, సుమారు లక్షా ఎనభై వేల ఫొటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి పలువురి పేర్లు కూడా ఉన్నాయి. పేరు ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదని అధికారులు చెబుతున్నప్పటికీ ఆ పేర్లలో దలైలామా పేరు కూడా ఉండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

More Stories
జె ఎన్ యు విద్యార్థి సంఘం నేతల బహిష్కరణ
వామపక్షాల సిద్ధాంతం విధ్వంసానికి సూచిక
చీనాబ్ నదిపై జలవిద్యుత్ ప్రాజెక్టుతో పాక్ ఆందోళన