2026 అండర్ 19 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచిన యువ భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టోర్నీ విజేత టీమ్ఇండియాకు రూ.7.5 కోట్ల భారీ ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ఈ టోర్నీలో యువ భారత్ అద్భుతంగా ఆడిందని, ఒక్క ఓటమి లేకుండా ఛాంపియన్‌గా నిలవడం గొప్ప విషయమని సైకియా అభినందించారు.
‘ఈరోజు ఛాంపియన్‌గా నిలిచిన అండర్ 19 జట్టును చూసి బీసీసీఐ మాత్రమే కాదు, యావత్ దేశం గర్వంగా ఉంది. మన కుర్రాళ్లు ఫైనల్లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడం, టోర్నీ ఆసాంతం ఓటమే లేకుండా టైటిల్ నెగ్గడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా యువ జట్టుకు ప్రోత్సాహకంగా బీసీసీఐ నుంచి రూ.7.5 కోట్ల భారీ ప్రైజ్‌మనీ అందించాలని నిర్ణయించాం’ అని సైకియా మీడియాతో వెల్లడించారు.
అంతకుముందు అండర్ 19 నెగ్గిన టీమ్ఇండియాపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ‘క్రికెట్‌తో భారత ప్రతిభ ప్రకాశిస్తోంది. వరల్డ్‌కప్ నెగ్గిన అండర్ 19 జట్టు పట్ల గర్వంగా ఉంది. మన యువ జట్టు టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడి, అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయం చాలా మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.

More Stories
మొదటిసారి రంజీ ట్రోఫీ గెలుపొందిన జమ్మూ కాశ్మీర్
దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా ప్రారంభించిన ప్రధాని మోదీ
మారుతున్న వాతావరణం, ఆర్థిక అభద్రతతోయువతలో ఆందోళన