అగ్రరాజ్యం అమెరికా తాజాగా ఆదేశ నేరస్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన “వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” (అత్యంత ప్రమాదకరమైన) నేరగాళ్ల జాబితాను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ జాబితాలో ఇతర దేశీయులతో పాటు 89 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఉండడం గమనార్హం.
ప్రస్తుతం ట్రంప్ సర్కారు వీరిని సామూహికరంగా బహిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం కొత్తగా WOW.DHS.GOV అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వరెస్ట్ ఆఫ్ ద వరెస్ట్ (డబ్ల్యూఓడబ్ల్యు) పేరుతో రూపొందించిన ఈ డేటాబేస్‌లో సుమారు 25,000 మంది నేరచరిత్ర కలిగిన అక్రమ వలసదారుల వివరాలను పొందుపరిచారు. ఇందులో నేరగాళ్ల పేర్లు, ఫోటోలు, వారు చేసిన నేరాలు, వారి జాతీయతను కూడా బహిరంగంగా ఉంచారు.
“అమెరికన్ల ప్రాణాలతో ఆడుకుంటున్న రాక్షసులను వీధుల నుంచి ఎలా తొలగిస్తున్నామో ప్రజలు స్వయంగా చూడాలనే” ఉద్దేశంతోనే ఈ వెబ్‌సైట్‌ను తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ జాబితాలో ఉన్న 89 మంది భారతీయులపై హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ ట్రాఫికింగ్, దొంగతనాలు, హిట్ అండ్ రన్ కేసులు, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
ఉదాహరణకు అమెరికాలో తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి కారణమై ముగ్గురు మృతికి కారకుడైన హర్నీత్ సింగ్, ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్‌ప్రీత్ సింగ్ వంటి వారి పేర్లు కూడా ఈ జాబితాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.

More Stories
యూనస్ ఇంటి ముందు హింసాయుత ప్రదర్శనలు
అండర్-19 వన్డే వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లకు టైటిల్
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడిలో 70 మందికి పైగా మృతి!