అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదనను యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. అయోధ్య విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ విమానాశ్రయంగా మారుస్తూ మంత్రివర్గం తాజాగా తీర్మానించింది.
టెంపుల్ టౌన్ అయోధ్యలోని విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ మంత్రివర్గం నిర్ణయించింది. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ ప్రారంభమైంది. భూసేకరణ పూర్తి కాగానే కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది.
అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని, యూపీలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా ఉండవచ్చని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2018 నవంబర్లో దీపావళి సందర్భంగా దీపాత్సవ్ సందర్భంగా ప్రకటించారు.
అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడాన్ని పలువురు సాధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ యూపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

More Stories
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు
న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయలేవు
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా