ఆర్‌ఎస్‌ఎస్ పై ‘శతక్: 100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్’ చిత్రం 19న విడుదల

ఆర్‌ఎస్‌ఎస్ పై ‘శతక్: 100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్’ చిత్రం 19న విడుదల

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మిచిన చిత్రం ‘శతక్: 100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్’ టీజర్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రం ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్దపు ప్రస్థానాన్ని, దాని సిద్ధాంతాన్ని, సామాజిక కార్యక్రమాలను, సంస్థాగత పరిణామాన్ని వివరిస్తుంది. ఫిబ్రవరి 19న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్దమవుతుంది.

2025లో ఆర్‌ఎస్‌ఎస్ తన స్థాపన వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక మైలురాయి ఈ చిత్రానికి నేపథ్యంగా నిలుస్తుంది. గత శతాబ్ద కాలంలో భారతదేశ సామాజిక, సాంస్కృతిక ముఖచిత్రాన్ని గణనీయంగా ప్రభావితం చేసిన ఒక నిరంతర ప్రస్థాన గాథను ‘శతక్’ ఆవిష్కరిస్తుంది.  ఇటీవల, ఈ చిత్రంలోని “భగ్వా హై అప్నీ పెహచాన్” అనే పాటను ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం కేశవ్ కుంజ్‌లో విడుదల చేశారు. 

ప్రముఖ గాయకుడు సుఖ్వీందర్ సింగ్ ఆలపించిన ఈ దేశభక్తి గీతం, చిత్ర స్ఫూర్తిని, సిద్ధాంత మూలాలను శక్తివంతంగా ఆవిష్కరిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో ముడిపడి ఉన్న దీర్ఘకాల అపోహలు, వివాదాలను కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుందని టీజర్ సూచిస్తుంది. కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఈ చిత్రం చరిత్రను, సిద్ధాంతాన్ని, సంస్థాగత వృద్ధిని సమతుల్యంగా, సందర్భోచితంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది.

స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, విధించిన నిషేధాల కాలంలో, అత్యవసర పరిస్థితి వంటి ముఖ్యమైన ఘట్టాలలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్రను ఇది కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ చిత్రం గురించి నిర్మాత వీర్ కపూర్ మాట్లాడుతూ, “నేను ఎల్లప్పుడూ ఈ దేశానికి, దాని ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌కు నాకు తోచిన విధంగా సేవ చేశాను” అని తెలిపారు. 

“వంద సంవత్సరాల క్రితం ప్రారంభమైన, నిశ్శబ్దమైన, అవిశ్రాంత ప్రయత్నంతో నిర్మించిన ఒక ప్రస్థానంలో ‘శతక్’ ఒక వినయపూర్వకమైన అడుగు. ప్రపంచం స్ఫూర్తి కోసం భారతదేశం వైపు చూస్తున్న ఈ సమయంలో, ఊహాగానాలు , అపోహలకు అతీతంగా ఈ కథను సత్యసంధంగా చెప్పడం, దేశ నిర్మాణంలో సంఘ్ పాత్రను గుర్తించడం చాలా అవసరం. స్పష్టత, ఐక్యత, జాతీయ గర్వం అనే చాలా పెద్ద లక్ష్యంలో మా ఈ చిత్రం ఒక చిన్న తోడ్పాటు” అని చెప్పారు.

దర్శకుడు ఆశిష్ మాల్ ఈ ప్రాజెక్ట్‌ను ఒక వ్యక్తిగత ప్రయాణంగా అభివర్ణిస్తూ, ఇలా అన్నారు: “పరిశోధన ప్రక్రియలో, సంఘ్‌కు సంబంధించిన చాలా మందికి తెలియని, అరుదుగా చర్చకు వచ్చే అనేక అంశాలు నాకు తెలిశాయి. ఈ వాస్తవాలను నిజాయితీగా ప్రదర్శించడం, సమాజంలో ప్రబలంగా ఉన్న అపోహలను తొలగించడం మా ప్రాధాన్యత.”

ఈ చిత్రం పుస్తకాలు, పత్రాలు, అందుబాటులో ఉన్న చారిత్రక సాహిత్యం ఆధారంగా రూపొందించబడింది. 1875 నుండి 1950 మధ్య ఉద్భవించిన అనేక ఉద్యమాలలో, చీలికలు లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగించిన ఏకైక సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్ నిలుస్తుంది. ఈ కొనసాగింపే దాని గొప్ప బలం. ఈ చిత్ర ట్యాగ్‌లైన్, ‘నా రుకే, నా థకే, నా ఝుకే’ (ఆగదు, అలసిపోదు, తలవంచదు), ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 

ఈ చిత్రాన్ని ఆశిష్ తివారీ సహ-నిర్మించారు. ఎడిఎ 360 డిగ్రీ ఎల్ ఎల్ పి సమర్పిస్తోంది. అనిల్ డి. అగర్వాల్ భావనతో, ఆశిష్ మాల్ దర్శకత్వంలో రూపొందిన “శతక్: సంఘ్ 100 సంవత్సరాలు” చిత్రం 2026