2027 జనగణనలో పౌరుల కులాన్ని నమోదు చేసేందుకు అనుసరించే ప్రక్రియను ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. పిటిషన్‌దారు, విద్యావేత్త ఆకాష్ గోయల్ పిల్‌లో చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని, భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కార్యాలయాన్ని ఆదేశించింది.
కుల సమాచారాన్ని గుర్తించడానికి ”ముందుగా నిర్ణయించిన డేటా” లేదని ధర్మాసనం తెలిపింది. ”ఈ ప్రక్రియ జనాభా గణన చట్టం 1958, 1990 రూపొందించిన నిబంధనల ప్రకారం నియంత్రించబడుతుంది. జనగణన కార్యకలాపాల విధానాలు, పద్ధతులను నిర్ణయించడానికి సంబంధిత అధికారులకు అధికారం ఇస్తుంది” అని ధర్మాసనం పేర్కొంది.
లీగల్ నోటీసు, పిటిషన్‌లో లేవనెత్తిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకోవచ్చని, పిల్‌ను కొట్టివేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. పౌరుల కుల సమాచారాన్ని నమోదు చేయడానికి, వర్గీకరించడానికి, ధృవీకరించడానికి వినియోగించే పారదర్శక ప్రశ్నాపత్రాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ముక్తా గుప్తా కోరారు.
కులగణన ఎస్‌సి,ఎస్‌టి వర్గాలను దాటి ఉందని అంగీకరించినప్పటికీ, పౌరుల కుల గుర్తింపును నమోదు చేసే ప్రామాణిక విధానాన్ని జనగణన కార్యాలయం వెల్లడించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2027 జనగణన అధికారికంగా 16వ జాతీయ జనగణన. 1931 తర్వాత సమగ్ర కుల గణనను చేర్చిన మొదటి జనగణన, దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనగణన కానుంది.

More Stories
పెన్నియార్ నది వివాదం పరిష్కారంకు ప్రత్యేక ట్రిబ్యునల్
జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు
ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి!