బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత నితిన్ నబీన్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర అగ్ర నేతల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం 37 సెట్ల నామినేషన్లు అధ్యక్ష పదవి కోసం దాఖలయ్యాయని, అవన్నీ నితిన్ నబీన్ తరపునే ఉండటంతో ఎన్నికల ఏకగ్రీవమైందని బీజేపీ కేంద్ర ఎన్నికల అథారిటీ ప్రకటించింది.
అధ్యక్ష పదవి కోసం ఒక్కటే నామిషన్ దాఖలు కావడంతో నితిన్ నబీన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు జెపి నడ్డా నితిన్ తరఫున నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, పలువురు బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు.
తర్వాత నితిన్ నబీన్‌కు మద్దతుగా బీజేపీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు లేఖలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పార్లమెంటరీ బోర్డు తరఫున కూడా నితిన్ నబీన్‌కు మద్దతుగా నామినేషన్ అందించారు.
బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ముందుగా రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావాలి. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం 50 శాతం చోట్ల రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక జరగాలి. ఇప్పటికే 30 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక పూర్తయింది. ఇది అవసరమైన కోరం కంటే చాలా ఎక్కువ. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియను విజయవంతంగా ముగించారు.

More Stories
భారత్, యుఎఇ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
రాసలీలలు వీడియోతో కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి సస్పెండ్
ఉన్నావ్ కేసులో సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు