మున్సిపల్ ఎన్నికల్లో మ‌హాయుతి కూట‌మికి 146 సీట్లు

మున్సిపల్ ఎన్నికల్లో మ‌హాయుతి కూట‌మికి 146 సీట్లు

మ‌హారాష్ట్ర మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముగియ‌డంతో ఫ‌లితాల‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఆన‌వాయితీ ప్ర‌కారం ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు ఎగ్జిట్ ఫ‌లితాలు ప్ర‌క‌టించాయి. ప్ర‌జా పోల్ అనాల‌టిక్స్ (పీపీఏ) సంస్థ సైతం మ‌హా మున్సిల‌ప్ ఎన్నిక‌ల‌ ఎగ్జిట్ పోల్స్‌ను విడుద‌ల చేసింది. ఆద్యంత ఉత్కంఠ‌గా సాగిన ఎన్న‌కల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ, శివ సేన (ఏక్‌నాథ్‌ షెండే)ల‌తో కూడిన‌ మ‌హాయుతి కూట‌మి అత్య‌ధిక సీట్లు గెలుచుకుంటుంద‌ని పీపీఏ తెలిపింది. 

మ‌హాయుతి కూట‌మికి146 సీట్లు వ‌స్తాయ‌ని, ఇందులో బీజేపీకి 109 స్థానాలు, షిండే వ‌ర్గానికి 37 సీట్లు వ‌స్తాయని ఈ సంస్థ పేర్కొంది. భార‌త దేశంలోనే సంప‌న్న‌మైన మ‌హారాష్ట్ర మున్నిపాలిటీ ఎన్నిక‌ల్లోని 227 స్థానాలకు ఎన్నిక‌లు జ‌రుగ‌గా మ‌హాయుతి కూట‌మి సింహ‌భాగం సీట్లు కైవ‌సం చేసుకోనుంది. 

మ‌హాయుతి కూటమికి146 సీట్ల‌లో ప‌దిహేను త‌గ్గ‌డం లేదా పెరిగే అవకాశం  ఉంద‌ని పీపీఏ సంస్థ‌ చెప్పింది. మ‌హా వికాస్ అఘాడీ కూటమి రెండో స్థానానికి ప‌రిమితం అవుతుంద‌ని ప్ర‌జా పోల్ అనాల‌టిక్స్ సంస్థ తెలిపింది. ఈ కూటమి కేవ‌లం 53 స్థానాల‌కే ప‌రిమితం అవుతుంద‌ని చెప్పింది. ఈ కూట‌మిలోని శివ సేన‌(యూబీటీ)కి 44 సీట్లు, రాజ్ ఠాక‌రే పార్టీ ఎంఎన్ఎస్‌కు 8, ఎన్సీపీ(ఎస్‌పీ)కి ఒకే ఒక సీటు వ‌స్తుంద‌ని పీపీఏ వెల్ల‌డించింది. ఇందులో ఎనిమిది స్థానాలు అటూ ఇటూ కావొచ్చని పేర్కొంది.

ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల్లో మాత్రం బీజేపీ కూట‌మి భారీ విజ‌యం సాధిస్తుంద‌ని ‘యాక్సిస్ మై ఇండియా’, జేవీసీ సంస్థ‌లు అంటున్నాయి. క‌మ‌ల కూట‌మికి 138 సీట్లు ఈ సంస్థ‌ల స‌ర్వే చెబుతోంది. శివ‌సేన యూబీటీ కూట‌మి 59 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని, కాంగ్రెస్ కూట‌మి 23 సీట్లు, ఇత‌రులకు 7 సీట్లు ద‌క్కుతాయ‌ని అంచ‌నా వేసింది.

కాగా, ముంబై, మహారాష్ట్రలోని మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లలో సుమారు 50 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5.30 గంటలకు పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వాఘ్మారే, 29 పౌర సంస్థలలో పోలింగ్ శాతం 46-50 శాతం మధ్య ఉందని తెలిపారు. 2017 ఎన్నికలలో, ముంబైలో పోలింగ్ శాతం 55.53గా ఉండగా, 26 కార్పొరేషన్లలో సగటు ఓటింగ్ శాతం 56.35 శాతంగా ఉంది.