అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతుల మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందారు. మృతులు ఇద్దరు మహబూబాబాద్ మండలం గార్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.

పులఖండం మేఘనారాణి (25), కడియాల భావన (24) ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.  వీరిద్దరితో కలిసి మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లారు. టూర్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద భావన, మేఘరాణి ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారని ఇక్కడి వారి బంధువులకు సమాచారం అందించారు.

ఇద్దరి వయసు 24 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరు విద్యార్థినులు మరణించడంతో గార్ల గ్రామంలో విషాదం అలుముకుంది. కాలిఫోర్నియాలో జరిగిన మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇద్దరు విద్యార్థినులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం కారు ప్రమాదంలో మరణించడంతో విషాదచాయలు అలుముకున్నాయి.