అమెరికా, ఐరోపా దేశాల్లో వలసలపై ఆంక్షలతో ఆ దేశాలే నష్టపోతున్నాయని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టంచేశారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే ఆ ఆంక్షలు విధించిన దేశాల సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. చివరకు ఆ దేశాలే నష్టపోతాయని హెచ్చరించారు.ఢిల్ల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలోపాల్గొంటూ చాలా సందర్భాల్లో అమెరికా, ఐరోపా దేశాల వాళ్లే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
వలసలకు సంబంధించి అమెరికా, ఐరోపా దేశాల్లో ఏమైనా ఆందోళనలు ఉంటే అవి ఆ దేశాలు అమలు చేసిన దీర్ఘకాలిక విధానాల ఫలితమేనని స్పష్టం చేశారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఉద్దేశపూర్వకంగా అన్నీ తెలిసే తమ వ్యాపారాలను విదేశాలకు విస్తరించారని, ఇది వారి వ్యూహమని, కాబట్టి ఈ సమస్యలకు స్వయంగా పరిష్కార మార్గాలను వారే కనుగొనాలని వ్యాఖ్యానించారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలనేవి ఇరుపక్షాలకు ప్రయోజనమని పాశ్చాత్య దేశాలు గుర్తించాలని సూచించా రు.

More Stories
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా అనుపిందర్ సింగ్ గ్రేవాల్
టూరిస్ట్ వీసాపై వచ్చిన ముగ్గురు మతబోధకులపై వేటు!
బెంగాల్ లో బీజేపీకి మెజారిటీ, టీఎంసీ పతనం .. పలు ఎగ్జిట్ పోల్స్