తిరుపతిలో 600 ఎకరాలలో ధార్మిక టౌన్ షిప్

తిరుపతిలో 600 ఎకరాలలో ధార్మిక టౌన్ షిప్
ప్రముఖ హైందవ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 600 ఎకరాల్లో ధార్మిక టౌన్ షిప్ ను  డెల్లా గ్రూపు నిర్మిస్తోంది. ఐదు వేల సంవత్సరాల హిందూ మత సాంస్కృతిక చరిత్రను ప్రపంచానికికంతటికీ తెలియజేయాలనే లక్ష్యంతో డెల్లా గ్రూపు తిరుపతిలో భారీ స్థాయిలో వసుదైక కుటుంబం పేరుతో  అంతర్జాతీయ టౌన్ షిష్ ను నిర్మిస్తోంది. దీనికి సంబంధించి తిరుపతి విమానాశ్రయానికి దగ్గరల్లో 600 ఎకరాలను ఇప్పటికే ప్రయివేట్ డెవలపర్ సంఖ్యకూర్చుకున్నారు.
 
ప్రయివేట్ భూముల్లో చేపట్టబోయే ఈ ప్రైవేట్ ప్రాజెక్ట్ కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి, తిరుపతి జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కోరారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగానిని కలిసిన డెల్లా ప్రతినిధులు జిమ్మి మిస్త్రీ, దిబ్వేందు బెనర్జీయేలు  ప్రాజెక్ట్ స్వరూపాన్ని వివరించారు. 
 
ఈ ప్రాజెక్ట్ ద్వారా తిరుపతి ప్రపంచ స్థాయి టూరిస్ట్ హబ్ గా మారుతుందని వారు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లో హిందూయిజంపై ప్రపంచపు మొట్టమొదటి ఎగ్జిబిషన్ తోపాటు అధ్యాత్మిక, సాంస్కృతిక, అతిథ్యం, మెడికల్ వెల్ నెస్ సెంటర్లు, అడ్వంచర్ పార్కులు, లీడర్షీప్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్స్, అత్యున్నత రియల్ ఎస్టేట్ అంశాలను మేళవించి టౌన్ షిప్ ను నిర్మిస్తామని చెప్పారు.  
 
ఈ టౌన్ షిప్ నిర్మాణం ద్వారా దాదాపు 3 వేల కోట్ల రూపాయల విలువ ఉనికిలోకి వస్తుందని చెప్పారు.  ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఈ ప్రాజెక్ట్ కు త్వరగా అనుమతిలిచ్చేందుకు, ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం వైపు నుండి అన్నిరకాలుగా సహయ, సహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కోరారు.
 
దీనిపై మంత్రి స్పందిస్తూ  అధ్యాత్మిక పర్యాటక రంగాన్ని కూడా తమ ప్రభుత్వం పోత్సహిస్తోందని హామీ ఇచ్చారు. ఇప్పటికే  వివిధ దేశాల నుండి భక్తులు వస్తున్న తిరుపతికి ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా  మరింత ప్రయోజనం జరగనుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు ప్రభుత్వ పరంగా నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు త్వరగా ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాడుతోనూ మాట్లాడతానని డెల్లా గ్రూపు ప్రతినిధులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.