
దుబ్బాకలో బిజెపి అభ్యర్థి గెలుపొందడంతో బిజెపి సోషల్ మీడియా కీలక పాత్ర పోషించినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు.
బీజేపీ ఐటీ సెల్ జీహెచ్ ఎంసీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాలాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో బీజేపీ సోషల్ మీడియా వాస్తవాలను పబ్లిక్ లోకి అద్భుతంగా తీసుకెళ్లిందని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం, పార్టీపై టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని సంజయ్ పిలుపిచ్చారు. వాట్సప్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్ ద్వారా వాస్తవాలను బూత్ లెవెల్ కు తీసుకెళ్లాలని కోరారు.
ఇప్పటికే కేసీఆర్ కూతురు కవితను నిజామాబాద్ లో ఓడించామని, సీఎం అల్లుడు హరీశ్ రావు ఇన్‌చార్జ్ గా ఉన్న దుబ్బాకలో ఓడించామని, ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్‌ను జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా బృందాలు టీఆర్ఎస్, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఇంటింటికీ చేరవేయాలని సూచించారు. బీజేపీ సక్సెస్ స్టోరీలను, కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లను, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని చెప్పారు. సమావేశంలో గ్రేటర్ లోని 150 డివిజన్ల సోషల్ మీడియా వారియర్లు, పలువురు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి