రాజవంశీయ వంటశాలల నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు శతాబ్దాల చరిత్ర కలిగిన ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో వంటకాల వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. లక్నోను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ప్రకటించింది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో నిర్వహించి యునెస్కో 43వ సాధారణ సమావేశంలో అధికారికంగా ప్రకటించింది. లక్నోకు యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
“లక్నో ఒక శక్తివంతమైన సంస్కృతికి పర్యాయపదం. దాని ప్రధాన భాగంలో గొప్ప పాక సంస్కృతి ఉంది. ఈ అంశాన్ని యునెస్కో గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు లఖ్‌నవూను సందర్శించి దాని ప్రత్యేకతను కనుగొనాలని నేను పిలుపునిస్తున్నాను” అని కేంద్ర మంత్రి షెకావత్ చేసిన పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ ఈ మేరకు రాసుకొచ్చారు.
‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ’గా హైదరాబాద్ తర్వాత రెండో భారతీయ నగరంగా లక్నో గుర్తింపు పొందిదని కేంద్ర సాంస్కృతిక మంత్రి, జోధ్‌పుర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. లక్నోను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా గుర్తించింది. ఇది దేశంలోని విశిష్టమైన వంటకాల వారసత్వానికి ఒక గొప్ప గౌరవం. ఇది లక్నోను ప్రపంచ స్థాయిలోని ప్రతిష్ఠను పెంచి, ఆహారం, సంస్కృతి కేంద్రంగా గుర్తింపు తెచ్చింది.
“లక్నో సమృద్ధమైన ఆహార సంస్కృతి ఎప్పటి నుంచీ పర్యటకులను ఆకర్షిస్తోంది. ఈ గ్లోబల్ గుర్తింపు దాని ప్రభావాన్ని మరింత పెంచుతుంది. లక్నోలో ప్రతి వంటకం రాజవంశీయ వంటశాలల నుంచి వీధి భోజన విక్రేతల వరకు ఒక సంస్కృతిక కథ ఉంటుంది. ఈ హోదా అంతర్జాతీయ పరిధిని విస్తరించి, ఆహార ఆధారిత వ్యాపారాలను ప్రోత్సహించి, సుస్థిర పర్యాటకాన్ని పెంపొందిస్తుంది” అని ఆయన చెప్పారు.
నవాబుల నగరంగా ప్రసిద్ధి పొందిన లక్నో ఎప్పటి నుంచీ అద్భుతమైన వంటకాలకు పర్యాయపదంగా ఉంది. 2025లో ఈ నగరం తన అద్భుతమైన అవధీ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ముందడుగు వేసింది. అలాగే లఖ్‌నవూ విభిన్న రుచులు, కబాబులు, ప్రత్యేకమైన బిర్యానీ శైలికి ప్రసిద్ధి చెందింది. దీంతో ప్రపంచవ వ్యాప్తంగా 408 క్రియేటివ్ నగరాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ నగరాలు హస్తకళలు, డిజైన్, సినిమా, వంటకాలు, సాహిత్యం, మీడియా కళలు, సంగీతం వంటి రంగాల్లో తమ సృజనాత్మక కృషికి గుర్తింపుపొందాయి. ఈ ఏడాది, వాస్తుశిల్పం అనే కొత్త సృజనాత్మక విభాగాన్ని కూడా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్(యూసీసీఎన్)లో చేర్చినట్లు యునెస్కో తెలిపింది తెలిపింది.

More Stories
నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్!
తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు