ప్రభుత్వ పాఠశాల గోడపై గుర్తు తెలియని వ్యక్తులు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ దేశ వ్యతిరేక నినాదాలు రాశారు. దీంతో స్థానికులు తమ పిల్లలను స్కూల్కు తీసుకెళ్లినప్పుడు వాటిని పరిశీలించారు. పంజాబ్లోని బఠిండా జిల్లాలో ఆ ఘటన జరగ్గా, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని తల్వాండి సాబో పట్టణంలోని మన్వాలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గోడపై గుర్తు తెలియని వ్యక్తులు దేశ వ్యతిరేక నినాదాలు రాశారు.
ఖలిస్థాన్ జిందాబాద్ నినాదాలు రాసి ఉండడం చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. దుండగులు రాతలను పరిశీలించారు. అనంతరం ఖలిస్థాన్ జిందాబాద్ నినాదాలపై పెయింట్ వేశారు. నినాదాలకు సంబంధించి ఎలాంటి జాడ లేకుండా చర్యలు తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అదే సమయంలో పోలీస్ అధికారి జస్మీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గోడపై గుర్తు తెలియని వ్యక్తులు ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు రాసినట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. సమాచారం ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పలువురు వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు.
వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. స్థానిక వాతావారణాన్ని పాడు చేసే వ్యక్తులను మరికొందరని త్వరలో అరెస్టు చేస్తామని, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా అనేక జిల్లాల్లో ఇటువంటి దేశ వ్యతిరేక గ్రూపులు ఏర్పడ్డాయని చెప్పారు. అయితే ముఖ్యంగా పిల్లలు స్కూల్ వెళ్లేటప్పుడు గోడలపై వ్యతిరేక నినాదాలు కనిపించడం వల్ల స్థానిక ప్రజలు కాస్త భయభ్రాంతులకు గురయ్యారు.
స్వేచ్ఛా ఉద్యమాల వంటి భావనలను ప్రేరేపించే రాతలు ప్రాంతీయ భద్రతకు సవాలు కావచ్చని అభిప్రాయపడ్డారు. పోలీసులు ఇప్పటికే ప్రస్తావించినట్టు, ఇవి స్థానిక పరిస్థితిని పాడు చేసే ప్రయత్నాలు కావచ్చని తెలిపారు. నేపథ్య ప్రజాస్వామ్య వాతావరణం మీద ప్రభావం చూపే విధంగా ఉన్నాయని అన్నారు. చిన్నదిగా మొదలైనా పెద్ద స్థాయికి వెళ్లే అవకాశముంటుందని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

More Stories
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
సంతాప తీర్మానంలో విమర్శలపై బిజెపి అభ్యంతరం
అయోధ్య దర్శన సమయాల్లో మార్పులు!