తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి కన్నుమూత

తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి కన్నుమూత

తెలుగులో తొలి నేప
థ్య గాయని రావు బాలసరస్వతి (97) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న తన స్వగృహంలో  బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. స్వాతంత్య్రం రాకముందు బాలసరస్వతి దేవి ఆగస్టు 29, 1928లో జ‌న్మించ‌గా  తన ఆరేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించారు. 
 
ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ చిత్రంలో తొలి పాటను ఆలపించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు. ఆమె మరణం పట్ల ఇండిస్టీ పెద్దలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  సరస్వతి నాలుగేళ్ల వయసులోనే పలు స్టేజీలపై సాంగ్స్‌ పాడారు. ఆరో ఏట హెచ్‌.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్‌లో రికార్డు చేసింది. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్‌ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగులో తొలి నేపథ్య గాయని రికార్డు కూడా తనదే! 
 
భక్త ధ్రువ, ఇల్లాలు, రాధిక వంటి పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లోనూ యాక్ట్‌ చేశారు. పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు సినిమాల్లో పాడటం మానేశారు. కానీ గొంతు సవరించుకోవడం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్‌ గీతాలను ఆలపించారు. కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. అలా చివరి వరకు పాడుతూనే ఉన్నారు.