
తిరుపతి నగరాన్ని ఉలిక్కిపడేలా బాంబు బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి కుట్ర పన్నుతున్నట్లు రెండు అనుమానాస్పద ఈ-మెయిల్స్ రావడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈమెయిల్స్‌లో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను పేల్చబోతున్నట్లు హెచ్చరికలు వచ్చాయి.
అనుమానాస్పద మెయిల్స్‌లో ఉగ్రవాదులు తిరుపతిలో నాలుగు ప్రాంతాల్లో బాంబు పేలుస్తామని పేర్కొన్నారు.
దీంతో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు (బిడిఎస్) విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లోనూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. బీడీ టీమ్స్, స్నిపర్ డాగ్స్ సాయంతో ప్రతి మూలనూ పరిశీలించారు.
ఈ నెల 6న సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన ఉండటంతో, వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్ వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో కూడా సోదాలు జరిగాయి. ఏ అనుమానాస్పద వస్తువులు కనిపించకపోయినా, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. ప్రతి ప్రాంతాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈమెయిల్ బెదిరింపుల్లో తమిళనాడు తిరువళ్లూర్ కేంద్రంగా ఐఎస్ఐ నెట్వర్క్, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం ఉంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం, సైబర్ సెక్యూరిటీ విభాగాలు కలిసి దర్యాప్తు చేస్తున్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు గస్తీ పెంచారు.
More Stories
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి
భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా స్వదేశీ సంత
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు