డ్రగ్స్ రహిత సమాజం కోసం బిజెపి 3కె రన్

డ్రగ్స్ రహిత సమాజం కోసం బిజెపి 3కె రన్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని  హైదరాబాద్ లో ట్యాంకు బండి  అంబేద్కర్ స్టార్చ్ దగ్గర   నశా మక్తుభారత్  3కె రన్ కార్యక్రమాన్ని ఆదివారం విజయవంతంగా జరిపారు.
 
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశానికి వెన్నెముక యువతే అని, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా భారత్‌లో ఉండటం మన దేశానికి మహా బలం అని తెలిపారు. కానీ విదేశీ శక్తులు కుట్ర పూర్వకంగా డ్రగ్స్ కల్చర్ ను వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారత యువతను నిర్వీర్యం చేసి, దేశాన్ని బలహీన పర్చాలని వారి దురుద్దేశం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రగ్స్, మాదకద్రవ్యాలు కేవలం వ్యక్తిని కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆయన హెచ్చరించారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, అందువల్ల నశాముక్త్ భారత్ గా తీర్చిదిద్దుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. స్వచ్ఛమైన జీవనశైలి, స్ఫూర్తిదాయకమైన దేశభక్తి, మాదకద్రవ్యాల నుండి దూరం అనే మార్గంలోనే యువత నడవాలని పిలుపిచ్చారు.

 
“డ్రగ్స్ రహిత సమాజం కోసం, బలమైన భారతదేశం  దృఢమైన సంకల్పంతో యువత ముందుకు సాగుతాం” అనే నినాదంతో  ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి జరుపుతున్నసేవాపక్షంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.  బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ గారు అధ్యక్షత వహించిన ఈ  కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన  యువతను ఉద్దేశించి   డ్రగ్స్ వంటి మారద్రవ్యాలను దూరంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని, వికసిత్ భారత్ కోసం పని చేసి నవ భారత నిర్మాణంలో యువత పాల్గొనాలని పిలుపిచ్చారు. 
 
కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయలు శంకర్, సేవ పక్వాడ రాష్ట్ర కన్వీనర్, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు వీరేందర్ గౌడ్, గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు.