
* కుత్రిమ మేధస్సుతో సరికొత్త ఎన్నికల ప్రచారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుపరిచితమైన తన హావభావాలతో చేయి ఊపుతూ సంజ్ఞలతో తెరపై కనిపించారు. “లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది మీ చిరుత… కునాల్ చౌదరి, చాలా కఠినమైన వ్యక్తి. చాలా తెలివైన వ్యక్తి… నన్ను నమ్మండి. అతనికి మించి ఇంకెవ్వరూ బాగా పని చేయలేరు” అంటూ వైట్ హౌస్ ముందు నిలబడి ప్రకటించారు. అది నిజంగా ట్రంప్ కాదు.
రాజకీయ ఎన్నికలకు మించి పోటాపోటీగా జరిగే ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డుసు) ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ పేజీలోని వీడియోలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) అభ్యర్థిగా కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న కునాల్ చౌదరికి మద్దతుగా జరుగుతున్న ప్రచారంలో కుత్రిమ మేధస్సు ఉపయోగించి తయారు చేశారు.
గురువారం జరుగనున్న ఈ ఎన్నికలలో ఈ ప్రచారం ప్రత్యేకంగా విద్యార్థులను ఆకట్టుకుంది.
ఒకప్పుడు ఉత్తర క్యాంపస్ గోడలపై ప్రచార పోస్టర్లు, గ్రాఫిక్ లతో ప్రచారంతో హోరెత్తిన ఢిల్లీ యూనివర్సిటీ ఆవరణ ఈ పర్యాయం కుత్రిమ మేధస్సు ఉపయోగించి సెలబ్రిటీలు, అల్గోరిథం-ఆధారిత ఎండార్స్మెంట్లకు మారిపోయింది. పోస్టర్లు, హోర్డింగ్‌లు వంటి ఎన్నికల గ్రాఫిటీతో ప్రజా ఆస్తులను పాడు చేసినందుకు గత సంవత్సరం ఢిల్లీ హైకోర్టు అభ్యర్థులపై తీవ్రంగా విమర్శించింది.
పైగా, వాటిని తొలగించి, శుభ్రం చేసేంతవరకు ఓట్ల లెక్కింపు కూడా ఆగిపోయింది. దానితో ఎన్నికలు జరిగిన 1.5 నెలల తర్వాత చివరకు ఫలితాలు ప్రకటించారు. ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, క్యాంపస్ ప్రచారంలో చాలా కాలంగా కొనసాగుతున్న వాల్ పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌ల వాడకాన్ని అరికట్టాలని విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.
ఈసారి, క్యాంపస్ అంతటా భౌతిక ప్రచారం గణనీయంగా తగ్గిపోయింది. గోడలపై కొన్ని పోస్టర్లు మాత్రమే దర్శనమిచ్చాయి. విద్యార్థి సంఘాలు తమ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి రీల్స్, మీమ్స్, కుత్రిమ మేధస్సును ఎంచుకున్నాయి. ఎబివిపి అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆర్యన్ మాన్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో, నల్ల చొక్కా , అద్దాలు ధరించిన ‘బాలీవుడ్ నటుడు సంజయ్ దత్’ , ఏఐ వెర్షన్ లో “ఉమ్మీద్వార్” అని ప్రకటిస్తుంది. చౌదరి సొంత పేజీలో, రాకెట్‌తో చుట్టుముట్టబడిన ఎలోన్ మస్క్ అవతార్, అభ్యర్థి ప్రచారాన్ని లాంచ్‌ప్యాడ్‌తో పోలుస్తుంది.
More Stories
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ
నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు … ఇద్దరు ఎన్కౌంటర్
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం