
ప్రముఖ సామాజిక మాధ్యమం టిక్‌టాక్ అమెరికా కంపెని నియంత్రణలోకి వస్తుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సోమవారం ప్రకటించారు. చైనా ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఫ్రేమ్ వర్క్ ఒప్పందం కుదిరిందని, రెండు దేశాల ప్రతినిధులు వాణిజ్యపరమైన నిబంధనలకు అంగీకరించారని స్కాట్ తెలిపారు. అమెరికాలో టిక్‌టాక్ నిషేదానికి కారణమైన సమస్యలను పరిష్కరించే విదంగా చర్చలు జరిపామని, మరిన్ని విషయాలను త్వరలో తెలుపుతామని వెల్లడించారు.
ఆ సోషల్ మీడియా యాప్ వాడకం గురించి చైనాతో డీల్ జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. టిక్‌టాక్ యాప్‌ను ఆపరేషనల్‌గా ఉంచేందుకు చైనా కంపెనీతో దాదాపు ఓ ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. టిక్‌టాక్ వ్యవహారం గురించి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో శుక్రవారం చర్చలు జరపనున్నట్లు ట్రంప్ తెలిపారు.
దేశంలోని యువత ఆ యాప్ కోసం ఆసక్తిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికా, ఈయూ, చైనా మధ్య జరిగిన వాణిజ్య భేటీపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు.
తన సోషల్ ట్రూత్‌లో ” అమెరికా యువతకు ఇష్టమైన సామాజిక మాద్యమంతో ఒప్పందం కుదిరింది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు ” అంటూ టిక్‌టాక్ పేరు ప్రస్తావించకుండా రాసుకొచ్చారు. ఈ డీల్ కోసం చైనా అధ్యక్షుడితో శుక్రవారం మాట్లాడతానని తెలిపారు. చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ బైట్‌డ్యాన్స్ టిక్‌టాక్ యాప్‌ను డెవలప్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు బిలియన్ల వినియోగదారులను కలిగివుంది.
చైనా వ్యాపారవేత్త జాంగ్ యిమింగ్ 2021లో బైట్‌డ్యాన్స్ కంపెనీని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయంలో బీజింగ్‌లోని హైదియాన్ జిల్లాలో ఉన్నది. కరోనా సమయంలో టిక్‌టాక్ యాప్‌కు ఫుల్ క్రేజీ వచ్చింది. సోమవారం జరిగిన ఒప్పందంతో టిక్‌టాక్‌ని అమెరికాలో అనుమతించారు. దీంతో మిలియన్ల మంది అమెరికన్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 17 లోగా డీల్‌ను చైనా పూర్తిచేయకుంటే టిక్‌టాక్‌ను నిషేదిస్తామ ని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఆ యాప్‌కు కౌంటర్‌గా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కూడా షార్ట్ వీడియోలను విడుదల చేశాయి. రీల్స్, షార్ట్స్ పేరుతో ఆ వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
More Stories
నేడు భారత్-అమెరికా వాణిజ్య చర్చలు
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ఊర్వశి, మిమి చక్రవర్తిలకు నోటీసులు