* పుస్తకంలో వీర సావర్కర్ పై అనుచిత వాఖ్యల పట్ల ఆగ్రహం
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలపై ఏక్నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ గురించి పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు ఆయనను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు.
సావర్కర్ హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించినట్లుగా పుస్తకంలో రాశారని శివసేన నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా బాలాసాహెబ్ ఠాక్రే గతంలో సావర్కర్‌ను హిందుత్వానికి ఆత్మగా అభివర్ణించేవారని గుర్తుచేశారు. సావర్కర్ సిద్ధాంతాలు, హిందుత్వ భావజాలం పట్ల శివసేనకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ సోనియా గాంధీ పుస్తకంలోని వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.
అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని, సావర్కర్‌పై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా ఉన్న అంశాలను సరిచేయాలని కోరారు. తమ నిరసనను తెలియజేస్తూ షైనా ఎన్.సి., సంజయ్ నిరుపమ్, ఆనంద్ దుబేలతో సహా శివసేన నాయకులు ఆ పుస్తకంలోని పేజీలను చించివేసి, 201, 443 పేజీలలోని వివాదాస్పద భాగాలను తొలగించాలని ప్రచురణకర్త హార్పర్కాలిన్స్ను డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌ను “హిందుత్వ వ్యతిరేకి”గా అభివర్ణించడం ద్వారా గాంధీ ఆయనను అవమానించారని షైనా ఎన్.సి. ఆరోపించారు. “సోనియా గాంధీ సావర్కర్‌ను అవమానిస్తున్నారు. ఆమె ఆయన్ని హిందుత్వ వ్యతిరేకి అని పిలుస్తున్నారు. కానీ బాలాసాహెబ్ థాకరే ఎప్పుడూ సావర్కర్ హిందుత్వకు ఆత్మ అని చెప్పేవారు,” అని ఆమె తెలిపారు.
భారత పౌరసత్వం పొందడానికి గాంధీ పడిన ప్రయాసను ప్రశ్నిస్తూ, షైనా ఇలా పేర్కొన్నారు, “సోనియా జీ, భారత పౌరసత్వ ప్రక్రియను ప్రారంభించడానికే మీకు 15 ఏళ్లకు పైగా పట్టింది. సావర్కర్ తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా కాలాన్ని కేవలం జైలులోనే కాదు, భారత్ కోసం కూడా అంకితం చేశారు.
తీర్పు చెప్పడానికి మీరెవరు?” చరిత్రను వక్రీకరించడానికి గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తూ, “మీరు ఒక పుస్తకం రాయండి. దానికి స్వాగతం. మీరు చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తే; మేము దానిని అనుమతించము,” అని తెలిపారు. భారత స్వాతంత్ర్య పోరాటం కోసం సావర్కర్ కాలాపానీలో 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తూ, బాల్ థాకరే ఆ స్వాతంత్ర్య సమరయోధుడిని ఎంతగానో గౌరవించేవారని చెప్పారు.
ర్కొంటూ ఆయనను అవమానించారని శివసేన నాయకులు ఆరోపించారు. శివసేన ప్రతినిధి సంజయ్ నిరుపం మాట్లాడుతూ, “ఆమె పుస్తకంలో రాసిన విషయాలు ‘ప్రేమ ప్రయాణం’ కావు, ఇవి పూర్తిగా ‘ద్వేష ప్రయాణం’. భారతదేశపు గొప్ప విప్లవకారుడు, మహారాష్ట్ర గర్వించదగ్గ బిడ్డ, రాష్ట్ర ప్రజలందరూ దైవంలా ఆరాధించే వీర్ సావర్కర్ పట్ల ఆమె నిరంతరం ద్వేషాన్ని కలిగి ఉన్నారు” అని విమర్శించారు.
“ఆమె మనసులో హిందువుల పట్ల ఖచ్చితంగా ద్వేషం ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తన కళ్లలో నీళ్లు తిరిగాయని ఆమె ఈ పుస్తకంలో రాసుకున్నారు. కానీ, శ్రీరాముని ఆలయాన్ని కూల్చివేసి అక్కడ మసీదును నిర్మించినప్పుడు ఆమెకు ఏమాత్రం బాధ కలగలేదు” అని ఆయన ఎద్దేవా చేశారు.
దీంతో సోనియా గాంధీ ఆత్మకథ చుట్టూ రాజకీయ దుమారం మొదలైంది. ఇప్పటికే సావర్కర్ చరిత్ర, హిందుత్వ సిద్ధాంతాలపై దేశవ్యాప్తంగా భిన్న రాజకీయ అభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుస్తకంలోని వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెస్, శివసేన మధ్య రాజకీయ విమర్శలకు వేదికగా మారాయి.
యూబీటీ సేన కార్పొరేటర్లు బీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ రితు తావ్డే కార్యాలయం బయట కూడా నిరసన తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, శివసేన (షిండే వర్గం) గ్రూప్ నాయకుడు అమే ఘోలే మాట్లాడుతూ, సోనియా గాంధీ పుస్తకం యూబీటీ వర్గానికి ‘భగవద్గీత’గా మారిందని ఎద్దేవా చేశారు. వారు చించిన ఫోటో మణిశంకర్ అయ్యర్‌ది అని, అదే యూబీటీ వర్గానికి అసలు బాధ కలిగిస్తోందని ఘోలే పునరుద్ఘాటించారు.

More Stories
కేజ్రీవాల్‌కు పంజాబ్‌ను ఏటీఎంగా మార్చిన భగవంత్ మాన్
2035కు ప్రపంచంలో అతిపెద్ద మతంగా క్రైస్తవం బదులు ముస్లిం!
మునుగోడుకు నిధులు ఆపేస్తే ఇది మరో కురుక్షేత్రం అవుతుంది!