అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా అమెరికా ప్రభుత్వ అధికారుల హత్యకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తరపున కుట్ర పన్నినందుకు, ఆసిఫ్ మర్చంట్ అనే పాకిస్తానీ జాతీయుడికి అమెరికా ఫెడరల్ కోర్టు 330 నెలల (27 సంవత్సరాల ఆరు నెలల) జైలు శిక్ష విధించిందని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.
జాతీయ సరిహద్దులను దాటి ఉగ్రవాద చర్యకు పాల్పడటానికి ప్రయత్నించడం, కిరాయి హత్య వంటి నేరాలకు గాను మార్చి 2026లో ఫెడరల్ జ్యూరీ దోషిగా నిర్ధారించిన 48 ఏళ్ల మర్చంట్‌కు, బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో అమెరికా జిల్లా జడ్జి ఎరిక్ ఆర్ కమిటీ ఈ శిక్షను విధించారు. ఇతను ఇరాన్ ప్రభుత్వ ప్రపంచ ఉగ్రవాద దళమైన ఐఆర్జీసీలో శిక్షణ పొందిన పేర్కొన్నారు.
“అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నాన్ని సమన్వయం చేయడానికి అమెరికాకు వచ్చిన ఒక ఇరాన్ ఏజెంట్‌కు అతని నేరపూరిత ప్రవర్తనకు న్యాయబద్ధంగా శిక్ష విధించబడింది,” అని అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె తెలిపారు. “మా నాయకులపై విదేశీ ఉగ్రవాద కుట్రలను న్యాయ శాఖ సహించదు. బాధ్యులను జవాబుదారీగా నిలబెట్టే వరకు ఆగదు,” అని ఆయన జోడించారు.
మర్చంట్ స్వచ్ఛందంగా ఐఆర్జిసిలో చేరి, ఇరాన్ దళాల తరపున అమెరికా ప్రభుత్వ అధికారులను చంపడానికి కిరాయి హంతకులను గుర్తించి, వారికి డబ్బు చెల్లించేందుకు అమెరికాకు వెళ్ళే ముందు శిక్షణ పొందిన గూఢచారిగా మారాడు. ఈ హత్య కుట్రకు అంతిమ లక్ష్యం ట్రంప్ అని మర్చంట్ భావించాడు. అయితే, అప్పటి అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా ఉన్న అప్పటి అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ కూడా ఇతర లక్ష్యాలుగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నాడు.
జనవరి 2020లో అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఐఆర్జిసి మాజీ కమాండర్ ఖాసెమ్ సులేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఇరాన్ కోరికతో ఈ కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. జాతీయ భద్రత తాత్కాలిక ప్రధాన డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఎం స్కాట్ ప్రాక్టర్ మాట్లాడుతూ, సులేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికే ఐఆర్జిసి మర్చంట్‌ను అమెరికాకు పంపిందని చెప్పారు.
2022 ప్రాంతంలో మర్చంట్‌ను ఐఆర్జిసి నియమించుకుంది. ఒక బంధువు ద్వారా, అతనికి ఐఆర్‌జిసికి చెందిన యూసెఫ్ మెర్హార్దాద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు, ఇతనే అతనికి హ్యాండ్లర్ గా వ్యవహరించాడు. 2023 ప్రాంతం నుండి, మర్చంట్ సుమారు ఏడాదిన్నర కాలంలో టెహ్రాన్‌లో అథైని దాదాపు 15 సార్లు కలిశాడు. ఈ సమావేశాల సందర్భంగా, అమెరికా ప్రభుత్వ అధికారులను హత్య చేసే కుట్రను అమలు చేయడానికి అమెరికాకు వెళ్లాలని ఆదేశించాడు.

More Stories
భవిష్యత్తును పోటీతో కాదు, సహకారంతో తీర్చిదిద్దాలి
ఐరోపా సెలవు ఉత్సవాల్లో ఉగ్రవాద దాడులు అవకాశం!
వీసా గడువుపై ఆంక్షల నిబంధన కొట్టేసిన అమెరికా కోర్టు