యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేరిట మరో రికార్డు నమోదు అయ్యింది. కెరీర్లో ఇప్పటికే పలు మైలురాళ్లు అందుకున్న ఈ చిచ్చరపిడుగు తాజాగా ఏకంగా పురుషుల టీ20 క్రికెట్లో ఓ జట్టుకు నాయకత్వం వహించిన అతిపిన్న వయసున్న కెప్టెన్‌గా వైభవ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో క్రొయేషియా క్రికెటర్ జాచ్ వుకుసిక్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ఇవాళ బీహార్, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరుగుతోంది.
అయితే గత శుక్రవారమే సూర్యవంశీని బీహార్ కెప్టెన్‌గా ప్రకటించారు. ఇక నేటితో వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్ల 232 రోజులు. గతంలో క్రొయేషియా క్రికెటర్ జాచ్ 17 ఏళ్ల 311 రోజుల వయసులో ఆ దేశ కెప్టెన్‌గా బాధ్యత నిర్వర్తించాడు. దీంతో ఇప్పుడు యంగెస్ట్ కెప్టన్‌గా వైభవ్ రికార్డు క్రియేట్ చేశాడు. “బీహార్ జట్టుకు నాయకత్వం వహించడం ఒక కల నిజమైనట్లుగా ఉంది. ఈ అవకాశం లభించినందుకు నేను ఎంతో కృతజ్ఞుడను” అని సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత సూర్యవంశీ చెప్పారు.
కేవలం 5 నెలల క్రితమే అతను భారత జట్టు తరపున టీ20 మ్యాచ్ ఆడారు. ఇక ఏడాది క్రితమే జింబాబ్వేలో జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను గెలిపించాడతను. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వైభవ్ మరో మ్యాచ్ ఆడనున్నాడు. ఆ తర్వాత అతను దోహాలో జరిగే రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా ఏ జట్టుతో జతకలవనున్నాడు.
కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించినా అతడికి నిరాశ తప్పలేదు. తాను సారథ్యం వహించిన తొలి మ్యాచ్‌లోనే తమ జట్టు ఓడిపోయింది. అలాగే వైభవ్ బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. 12 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. అతడిని చేతన్ సకారియా రిటర్న్ క్యాచ్ ద్వారా పెవిలియన్‌కు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.
పృథ్వీ రాజ్ (38 పరుగులు) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. ఇక 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 16.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. హర్వాన్ష్ పంగాలియా (33 పరుగులు, 11 బంతుల్లోనే), రుచిత్ అహిర్ (21 పరుగులు), సిద్ధార్థ్ రానా (21 పరుగులు) రాణించారు.
కాగా, ఈ టోర్నీలో వైభవ్ ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ ఆడనున్నాడు. ఎందుకంటే, అతడు ఖతార్ రాజధాని దోహా వేదికగా త్వరలోనే ప్రారంభం కానున్న ‘ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఎమర్జింగ్ టోర్నమెంట్’ కోసం ‘ఇండియా ఏ’ జట్టుతో చేరనున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నమెంట్ నవంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

More Stories
ఎస్ఐఆర్ లో తొలగించిన 1.27 కోట్ల మందిని ఓటర్లుగా చేర్పించండి
నగ్న ఫొటోల కోసం వాయుసేన అధికారుల దేశ రహస్యాల తాకట్టు!
`స్వాతిక కర్మయోగం’కు ఓ సజీవ ఉదాహరణ శేషాద్రిజీ