అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభ తిరస్కరించింది. తద్వారా, పదవిలో ఆయన ప్రవర్తన, ఇరాన్ యుద్ధాన్ని నిర్వహించిన తీరుకు గాను పెంటగాన్ అధిపతిని తొలగించే ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది. ఆ తీర్మానాన్ని ప్రతినిధుల సభ 211– 204 ఓట్ల తేడాతో తిరస్కరించింది. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల పరాభవం తర్వాత రిపబ్లికన్ పార్టీ ఈ రిపబ్లికన్ ఎంపీ థామస్ మాస్సీ తీసుకొచ్చిన ఈ తీర్మానంపై నేరుగా చర్చ లేదా, ఓటింగ్ జరగకుండా ట్రంప్ యంత్రాంగం వ్యూహాత్మకంగా అడ్డుకుంది.
మధ్యంతర ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాల పర్యవసానాలతో రిపబ్లికన్లు సతమతమవుతున్న తరుణంలో ఈ ఓటింగ్ జరిగింది. ఈ పరాజయాలకు ఇరాన్ యుద్ధం, దాని ఫలితంగా పెరిగిన గ్యాస్ ధరలే కారణమని పార్టీలోని కొందరు ఆరోపించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెగ్సెత్కు బలమైన మద్దతు ప్రకటించిన తర్వాత, మంగళవారం రిపబ్లికన్ చట్టసభ సభ్యులు అధికశాతం మంత్రికి మద్దతుగా నిలిచారు. అయితే, జనవరిలో డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్లపై నియంత్రణ సాధించనున్న నేపథ్యంలో, ఈ ఓటింగ్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నాన్ని కేవలం ఆలస్యం చేయగలదు.
మాస్సీ, హెగ్సెత్‌పై ఎనిమిది అభిశంసన ప్రకరణలతో కూడిన ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్, యెమెన్‌లపై సైనిక దాడులకు అధికారం ఇవ్వడం ద్వారా అమెరికా యుద్ధ కార్యదర్శి రాజ్యాంగాన్ని, యుద్ధ అధికారాల చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి దారితీసిన ఆపరేషన్‌ను పర్యవేక్షించడంలో హెగ్సెత్కు ఉన్న పాత్రను కూడా ఆ తీర్మానం ప్రస్తావించింది.
తనపై వచ్చిన ఆరోపణలను హెగ్సెత్ ఖండిస్తూ తాము చేపట్టిన అన్ని సైనిక చర్యలు సైన్యాధ్యక్షుడైన అధ్యక్షుడి ఆదేశాల మేరకు చట్టపరిధిలోనే జరిగాయని తెలిపారు. ట్రంప్ వెంట నిలబడడం వల్ల తనకు ఈ పరిస్థితి వస్తే, దానిని గర్వంగా స్వీకరిస్తానని చెప్పారు.
హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నం ఓడిపోయిన తర్వాత, కొద్దిసేపటికే ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పార్టీ హద్దులు దాటి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాస్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెంటగాన్‌లో హెగ్సెత్ పనితీరును అధ్యక్షుడు సమర్థించారు, విదేశాలలో నిర్ణయాత్మక సైనిక విజయాలు, సాయుధ దళాలలో చేరికలలో అపూర్వమైన పెరుగుదలకు ఆయనే కారణమని పేర్కొన్నారు.
“మరోసారి, వెనిజులా, ఇరాన్లలో విజయాలు, సైనిక చరిత్రలోనే అత్యుత్తమ నియామకాల సంఖ్య (చేరడానికి సుదీర్ఘ నిరీక్షణ జాబితాలు!), మునుపెన్నడూ చూడని స్ఫూర్తి, ఒక గొప్ప అమెరికన్ దేశభక్తుడి నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి దారితీశాయి,” అని ట్రంప్ కొనియాడారు.

More Stories
రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం కోసం భారత్ సహకారం
దాడులపై సిరియా, జోర్డాన్ సంయుక్త దర్యాప్తు
ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్