పవన్ కల్యాణ్‌, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌, ఆయన భార్య అన్నా కొణిదెల విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ జీవితంలో గణనీయమైన కాలం కలిసి ప్రయాణించిన అనంతరం పరస్పర అవగాహన, గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘‘మా జీవితంలో గణనీయమైన భాగాన్ని కలిసి గడిపిన అనంతరం పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా వైవాహిక బంధానికి ముగింపు పలికినప్పటికీ, మంచి స్నేహితులుగా, మా పిల్లల పట్ల బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతాం. వారి సంతోషం, శ్రేయస్సే మా ఇద్దరి ప్రాధాన్యతగా ఉంటుంది’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ గోప్యతను గౌరవించాలని శ్రేయోభిలాషులకు ఈ జంట విజ్ఞప్తి చేసింది. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులకు తమ్ముడైన పవన్ కల్యాణ్‌ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 

గతంలో నందినిని వివాహం చేసుకున్న ఆయన, ఆ తర్వాత ఆమెతో విడిపోయారు. అనంతరం నటి, మోడల్ రేణు దేశాయ్‌ను 2009లో పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరిద్దరూ విడిపోయారు. ఈ దంపతులకు అకీరా నందన్‌, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2013లో రష్యాకు చెందిన అన్నాను పవన్ కల్యాణ్‌ వివాహం చేసుకున్నారు. వీరికి పోలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

About The Author