శ్రీ మాతా అమృతానందమయి దేవి (అమ్మ) రెండు రోజుల పాటు జరగనున్న 25వ వార్షిక బ్రహ్మస్థానం ఆలయ మహోత్సవాలకు నాయకత్వం వహించేందుకు హైదరాబాద్లోని భాగ్యనగర్ మాతా అమృతానందమయి మఠానికి చేరుకున్నారు. ఈ ఉత్సవాలు నవంబర్ 10, 11 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మకు భక్తులు ప్రార్థనలు, వేదమంత్రోచ్ఛారణలు, సంప్రదాయ మంగళ వాద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఘనస్వాగతం పలికారు.
రెండు రోజుల ఉత్సవాలు మంగళవారం ప్రారంభమవుతున్నాయి. ఉదయం సుమారు 11 గంటలకు అమ్మ ప్రధాన వేదికపైకి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు పుష్పమాలలతో అమ్మకు స్వాగతం పలుకుతారు. అనంతరం అమ్మ ఆధ్వర్యంలో ధ్యానం, సత్సంగం, భక్తి భజనలు నిర్వహిస్తారు. తదుపరి భక్తులకు అమ్మ దర్శనం కల్పిస్తారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మాతా అమృతానందమయి మఠం విస్తృత ఏర్పాట్లు చేసింది.

More Stories
కోర్టు దిక్కారణలో రంగారెడ్డి కలెక్టర్కు ఆరు నెలలు జైలుశిక్ష
తెలంగాణాలో జనవరి 15 నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్, 25 నుంచి జనగణన
ధరణి పోర్టల్ అక్రమాల వెనుక భారీ నెట్వర్క్