ఆరు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ

ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అర్హులైన ఓటర్లు, ముఖ్యంగా యువతను ఓటరు జాబితాలో చేర్చడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపింది. ఈ ప్రక్రియ కోసం సిబ్బందిని సమకూర్చాలని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. నకిలీ ఎంట్రీలు, ఒకే పేరుపై రెండు ఓట్లు ఉన్నట్లు వస్తున్న ఫిర్యాదులపై కచ్చితంగా క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ఈసీ స్పష్టం చేసింది. 

ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో రెండు శాతానికి మించి ఓట్ల తొలగింపు ఉన్నా, లేదా ఒకే వ్యక్తి ఐదు కంటే ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఈఆర్ఓలు స్వయంగా వాటిని పరిశీలించాలని ఆదేశించింది. కొత్త ఓటరు నమోదు కోసం ఇచ్చే ఫారం 6 మార్పులు, చేర్పుల కోసం ఇచ్చే ఫారం 8లో ఆధార్ వివరాలు సమర్పించడం పూర్తిగా స్వచ్ఛందం అని ఈసీ స్పష్టం చేసింది. ఆధార్ వివరాలు ఇవ్వలేదనే కారణంతో ఏ ఒక్క దరఖాస్తునూ తిరస్కరించరాదని, ఇప్పటికే ఉన్న పేరును ఓటరు జాబితా నుంచి తొలగించరాదని పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, మిజోరం, ఒడిశా, సిక్కింలో ఓటర్ల జాబితాల వార్షిక ప్రత్యేక సంక్షిప్త సవరణను ఎన్నికల సంఘం ప్రకటించింది. 2027 ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1న అర్హత పొందే వారి నుంచి ముందస్తు దరఖాస్తులను స్వీకరించడానికి వీలు కల్పించడం. అభ్యంతరాల పరిశీలన అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాలు నవంబర్ 30న ప్రచురించనున్నారు. 2027 జనవరి 21న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. 

అలాగే, ఓటర్ల జాబితాలో ఒకే పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉండి, వాటిని తొలగించాల్సి వస్తే క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి చేశారు. ఏదైనా ఒక పోలింగ్ కేంద్రంలో 2 శాతం కంటే ఎక్కువ ఓట్ల తొలగింపులు ఉన్నా, లేదా ఒకే వ్యక్తి 5 కంటే ఎక్కువ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు స్వయంగా వెళ్లి క్రాస్-చెక్ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

మరోవైపు, 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఎందుకంటే, ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఇప్పటికే కొనసాగుతోందని పేర్కొంది. అలాగే, ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఝార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, దిల్లీ, త్రిపుర, తెలంగాణ రాష్ట్రాల గురించి ప్రస్తావించింది.  

About The Author