జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన

భారతదేశ వ్యాప్తంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్​, మణిపుర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో జనగణన ఉండదని స్పష్టం చేసింది. అలాగే మంచు కురిసే జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ జనగణన ఉందని పేర్కొంది. భారత రిజిస్ట్రార్​ జనరల్ (ఆర్​జీఐ), సెన్సస్ కమిషనర్​ మృత్యుంజయ కుమార్​ నారాయణ్​ జారీ చేసిన ప్రకారం, జనాభా గణనకు రిఫరెన్స్​ తేదీగా 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలుగా నిర్ణయించారు.
ఆర్​జీఐ ప్రకారం, జనగణన ప్రక్రియలో భాగంగా 2027 మార్చి 1 నుంచి మార్చి 5 వరకు ‘సవరణ దశ’ (రివిజినల్​ రౌండ్​) ఉంటుంది.  ఇంటింటికీ తిరిగి జనాభాను లెక్కించే ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు, అంటే 2027 జనవరి 10 నుంచి జనవరి 24 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే (సెల్ఫ్​-ఎన్యూమరేషన్​) అవకాశం కల్పిస్తారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న 8వ జనగణన ఇది. దీనిని రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటిది గృహాల జాబితా తయారీ, గృహ గణన, రెండోది జనాభా లెక్కింపు. 

ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగాల్సిన ఈ ప్రక్రియ ఈసారి కాస్త ఆలస్యమయింది.య్యింది. వాస్తవానికి జగగణన 2021లోనే జరగాల్సి ఉండగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ భారీ జనాభా గణన ప్రక్రియ కోసం కేంద్ర మంత్రివర్గం రూ.11,718 కోట్లు కేటాయించింది. వాస్తవానికి, గతంలోనే మణిపూర్‌లో 2027 జనాభా గణనకు సంబంధించి గృహాల జాబితా తయారీ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

భారతదేశంలో చివరిసారిగా 2011లో జనాభా గణన జరిగింది. అప్పుడు దేశ జనాభా 121 కోట్లుగా నమోదైంది; ఇందులో 62.32 కోట్ల మంది పురుషులు, 58.75 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఆ సమయంలో దేశంలో 24.95 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.

About The Author