సబ్ స్క్రైబర్స్ వైభవం కోల్పోతున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్

ఓటీటీల్లో జెయింట్స్ అంటే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ప్లాట్ ఫామ్స్ కు మునుపటిలా సబ్ స్క్రైబర్స్ వైభవం లేదని లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మధ్య పోటీ సాగుతోన్నా, ఇతర ఓటీటీలు కూడా తమ సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన గణాంకాల ప్రకారం నెట్ ఫ్లిక్స్ లో వ్యూయింగ్ టైమ్ భారీ పెరిగింది. అయితే వ్యక్తిగతంగా ఉపయోగించేవారు సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. 

వ్యూయింగ్ టైమ్ పెరగడానికి కొత్తగా సబ్ స్క్రైబ్ తీసుకున్నవారు అదేపనిగా నెట్ ఫ్లిక్స్ లోని కొన్ని సూపర్ హిట్ మూవీస్, వెబ్ సిరీస్ వీక్షించడం వల్ల స్ట్రీమింగ్ టైమ్ పెరిగింది. అయితే మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడు సబ్ స్క్రైబర్స్ సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందట. ఇది నెట్ ఫ్లిక్స్ ఒక్క ఓటీటీ ప్లాట్ ఫామ్‌కే కాదు ఇతర ప్రముఖ ‘ఓవర్ ద టాప్’ సంస్థలూ తగ్గిన సబ్ స్కైబర్స్ తో పరేషాన్‌లో ఉన్నట్లు తెలియవస్తోంది.

అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్లో వ్యక్తిగతంగా చూసేవారి సమయం తగ్గడానికి కారణాల్లో మొదటిది పెరిగిన సబ్ స్క్రిప్షన్ చార్జెస్ అనే చెప్పాలి. ప్యాండమిక్ సమయంలో అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జనాన్ని ఆకర్షించడానికి రీజనబుల్ రేటుకే సబ్ స్క్రిప్షన్ అందించాయి. దాంతో సినిమా థియేటర్స్ కు వెళ్ళి సినిమా చూసే ఖర్చుతోనే రెండు, మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సబ్ స్కైబ్ చేసుకున్నారు. 

అలా అప్పట్లో థియేటర్స్ కు జనం రావడం తగ్గి ఓటీటీ స్ట్రీమింగ్ పెరిగింది. ప్రేక్షకులు తమవైపే ఉన్నారని తెలియగానే ఓటీటీ సంస్థలు భారీగా సబ్ స్క్రిప్షన్ రేట్స్ పెంచేశాయి. అయినప్పటికీ హిట్ సినిమాలు చూడాలనే కుతూహలంతో కొందరు సినీ ఫ్యాన్స్ వాటితోనే జర్నీ చేశారు. 

ఇక ఈ మధ్య ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్జ జీ5 లాంటివి యాడ్స్ మ‌ధ్య మాత్ర‌మే త‌మ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తూ వీక్ష‌కుల స‌హానానికి ప‌రీక్ష పెడుతూ వారి విలువైన స‌మ‌యాన్ని వృధా చేస్తున్నాయి. ఈ యాడ్స్ కు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు విసిగిపోయారు. ఆ కారణంగానూ పలువురు సబ్ స్క్రిప్షన్స్ ను రద్దు చేసేసుకున్నారు. అలా స్వతంత్ర వీక్షకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

About The Author