మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (121 బంతుల్లో 15 ఫోర్లతో 126), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (86 బంతుల్లో 15 ఫోర్లతో 106 నాటౌట్) సెంచరీల మోతకు స్పిన్నర్ వైష్ణవి శర్మ (4/39) బంతితో మ్యాజిక్ చేయడంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 121 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.
ఓపెనర్ ప్రతికా రావల్ (67) కూడా మెరవడంతో తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 328/6 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్ ముపచిక్వా (49), ముగెరి తిరిపనో (46) కాస్త పోరాడారు. దీప్తి శర్మ (3/35) మూడు వికెట్లు తీసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే అక్టోబర్ 28న జరగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన (0) మరోసారి నిరాశపర్చింది. ఆమె ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్‌కు చేరింది. వన్ డౌన్లో వచ్చిన షఫాలి వర్మ (8) కూడా నిరాశపర్చింది. దీంతో భారత్ 19 రన్స్‌కే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మరో ఓపెనర్ ప్రతీకా రావల్ (68 పరుగులు)తో కలిసి స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ క్రమంలో ప్రతీక హాఫ్ సెంచరీ పూర్తి చేసింది.
వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 118 బంతుల్లోనే 124 పరుగులు జోడించారు. ఈ పార్ట్నర్షిప్ భారత్‌కు కీలకంగా మారింది. ప్రతీకను నైషా ఔట్ చేయడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికి స్కోర్ 22.2 ఓవర్లకు 143-3. తర్వాత వచ్చిన తేజ హసబ్నిస్ (3) స్వల్ప స్కోరే చేసి ఔటైంది. ఆ తర్వాత వచ్చిన దీప్తి శర్మతో హర్మన్ ఇంకో భారీ పార్ట్నర్షిప్ చేసింది.
సెంచరీ అనంతరం కూడా బౌండరీలతో చకచకా పరుగులు సాధించింది. ఆమెను జట్టు స్కోర్ 301 వద్ద మవుంగా ఔట్ చేసింది. దీంతో ఐదో వికెట్‌కు 153 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత చివరిగాకా క్రీజులో ఉన్న దీప్తి కూడా సెంచరీ పూర్తి చేసుకుంది. జింబాబ్వే బౌలర్లలో సిబంద 2, మకుషా, మవుంగ, గ్వాంజుర, చారే తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించినహర్మన్కు వన్డే కెరీర్లో ఇది ఎనిమిదో సెంచరీ. మిథాలీ తన కెరీర్లో ఏడు సెంచరీలు చేసింది. తాజాగా హర్మన్ ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇక ఇప్పటిదాకా 165 వన్డేల్లో హర్మన్ 4541 పరుగులు చేసింది. ఇందులో 8 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

More Stories
ఇస్లామియాలోకి `అక్రమ ప్రవేశము’.. ముగ్గురు ఎంపీలపై కేసు!
దేవెగౌడ కుటుంబాన్ని `రాజకీయం అంతం’కై డీకే రూ 600 కోట్ల డీల్!
కొచ్చి కేఫ్‌లో గోమాంసం పై కేరళ సీఎం ‘ఎంపిక చేసిన లౌకికవాదం’ .. బీజేపీ