నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు 

ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విచారణ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రూ. 10,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఒక షూరిటీని సమర్పించాలంటూ పోలీసులు ఈ నోటీసు జారీ చేసింది.  
 
కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ నేహా బోరా దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఢిల్లీ హై కోర్టు శుక్ర‌వారం కొట్టివేసింది. సీఈసీకి వ్య‌తిరేకంగా సీజేపీ చేప‌ట్టిన ఆందోళ‌న‌ల్లో నేహాబోరా పాల్గొన్నారు. అనుమ‌తి లేకుండా ఆందోళ‌న సంద‌ర్భంగా జాతీయ జెండాను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అనుమ‌తి లేకుండా జంత‌ర్ మంత‌ర్ వైపు దూసుకెళ్ల‌డం, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగించ‌డం వంటి నేరాల‌పై గ‌త వారం ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
మ‌రుస‌టి రోజు కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆమె జైలు నుంచి నేహా బోరా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కీల‌క ఆదేశాలు జారీ చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజ‌రై, రూ.10,000 విలువైన పీస్ బాండ్‌పై సంత‌కం చేయాల‌ని ఆదేశించారు. అయితే, తాను ఏ శాంతి ఒప్పందంపై సంత‌కం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌న‌కు నిర‌స‌న తెలిపే హ‌క్కు ఉంద‌ని నేహా బోరా వ్యాఖ్యానించింది.

పీస్ బాండ్‌పై సంత‌కం చేయాలంటూ ఎస్ఈఎం ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌పై ఢిల్లీ పోలీసులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీనిపై శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగింది. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు నేహా బోరా పిటిష‌న్‌ను కొట్టివేసింది. అయితే, కోర్టు ఆదేశాల‌కు సంబంధించిన తుది కాపీ వెలువ‌డాల్సి ఉంది. కోర్టు వ్యాఖ్య‌ల‌కు అనుగుణంగా నేహా బోరా ఉన్న‌త స్థాయి కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంది.

పిటిషన్‌ను కొట్టివేసినప్పటికీ, విచారణలో పరిగణనలోకి తీసుకున్న ఆధారాలు, సమాచారాన్ని నేహా బోరాకు అందించాలని ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే, బీఎన్‌ఎస్‌ సెక్షన్ 135 ప్రకారం విచారణ ప్రారంభంలోనే బాండ్ తీసుకోవాలా లేదా విచారణ పురోగతిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలను బట్టి నిర్ణయించాలా అనే విషయాన్ని మేజిస్ట్రేట్ పరిశీలించాలని కోర్టు పేర్కొంది.

About The Author