శబరిమల నెయ్యి అక్ర‌మ త‌ర‌లింపు కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్ట‌ర్ అరెస్టు

 
కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి చెందిన నెయ్యిని అక్ర‌మంగా త‌ర‌లించిన కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్ట‌ర్ ఎస్ఎస్ బిన్నును అరెస్టు చేశారు. సుమారు 11000 లీట‌ర్ల మిల్మా బ్రాండ్ నెయ్యి స్థానంలో నాణ్య‌త లేని నెయ్యిని శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి త‌ర‌లించిన‌ట్లు బిన్నుపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీని వ‌ల్ల ఆల‌యానికి సుమారు రెండున్న కోట్ల న‌ష్టం వ‌చ్చిన‌ట్లు ట్రావెన్‌కోరు దేవ‌స్థానం బోర్డు పేర్కొన్న‌ది. 
 
2025 సీజ‌న్ కోసం శ‌బ‌రిమ‌ల‌కు నెయ్యిని ట్రాన్స్‌పోర్టు చేయాల‌ని బిన్నుకు కాంట్రాక్టు అప్ప‌గించారు. అయితే అత‌ను మిల్మా బ్రాండ్ నెయ్యికి బ‌దులుగా చౌక నెయ్యిని ఆల‌యానికి త‌ర‌లించాడు.ఆ కేసులో తొలి అరెస్టు జ‌రిగింది. కేర‌ళ హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం విజిలెన్స్ శాఖ ఈ అరెస్టు చేసింది. శుక్ర‌వారం ఆ కేసులో వీఏసీబీ బృందం బిన్నును ప్ర‌శ్నించింది. 
 
అర‌వ‌న ప్ర‌సాదం త‌యారీ కోసం పాత‌నంమిట్ట మిల్మా బ్రాండ్ నెయ్యిని దేవ‌స్థానం వాడాల‌నుకున్న‌ది. ఆ కాంట్రాక్టును టెండర్లు పిలవకుండా ట్రస్ట్ బోర్డు బిన్నుకు ఇచ్చింది. అయితే శ‌బ‌రిమ‌ల‌కు చెందిన ఒరిజిన‌ల్ నెయ్యిని త‌మిళ‌నాడులో రెండు ఏజెన్సీల‌కు బిన్ను మ‌ళ్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ నెయ్యి స్థానంలో నాణ‌త్య‌లేని నెయ్యిని దేవ‌స్థానికి స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు కేసు న‌మోదు అయ్యింది. డాక్యుమెంట్ల‌ను ఫోర్జ‌రీ చేసి, న‌కిలీ ఇన్‌వాయిస్‌ల‌ను బిన్ను సృష్టించిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది.
‘మిల్మా’  అనేది కేరళ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ బ్రాండ్ పేరు. విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రసాదంగా అందించే ‘అరవణ పాయసం’ (ఎర్ర బియ్యం, బెల్లం, నెయ్యితో తయారు చేసే తీపి పదార్థం) తయారీ కోసం తిరువాంకూర్ దేవస్వం బోర్డు మిల్మా నెయ్యిని కొనుగోలు చేసింది.

 

 

About The Author